Tuesday, April 14, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు ఫై మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ కేసు ఫై మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

Share

ప్రభాకర్.. కేసీఆర్ మనిషి.


బీఆర్ఎస్ అధినేత కోసమే ట్యాపింగ్

2018లోనే నా ఫోన్ ట్యాప్ చేశారు హుజూరాబాద్ లొ ఓడించాలని ప్లాన్
ప్రభుత్వానికి దమ్ముంటే సూత్రధారుల భరతం పట్టాలి. లేదంటే కేసును సీబీఐకి అప్పగించాలి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ:
మాజీ సీఎం కేసీఆర్ కోసమే ఫోన్ ట్యాపింగ్ జరిగిం దని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఎస్ఐబీ చీఫ్ గా పని చేసిన ప్రభాకర్ రావు ఆయనకు తొత్తుగా పనిచేశారని వ్యాఖ్యానించారు.

ఇది బహిరంగ రహస్యమ ని చెప్పారు. అయినా, కేసు దర్యాప్తు నత్తన డకన నడుస్తున్నదన్నారు. దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను బయట పెట్టేలా సత్వర చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయానికి వచ్చిన ఈటల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చారు. బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దేశ భద్రత కు భంగం కలిగించే వారిపై పెట్టాల్సిన నిఘాను తమపై పెట్టారన్నారు. నాయకులు తోపాటు వారి వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు, గన్మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. నిజానికి 2018లోనే తన ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా హుజూరా బాద్ లో ఓడించాలని ప్రయత్నించారన్నారు. 2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్ని కల ప్రచార సమయంలో ఆరునెలలపాటు తన ఫోన్ ను ట్యాప్ చేశారని చెప్పారు. తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో తెలుసుకు ని వారిని బెదిరింపులకు గురి చేశారన్నారు. డబ్బు, పదవుల ఆశ చూపించి నన్ను ఓడిం చేందుకు శతవిధాలా ప్రయత్నించారని చెప్పారు. గజ్వేల్, మునుగోడు ఎన్నికల సమయంలో కూడా పలువురు నాయకులు, వారి సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు
తెలిపారు.
ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉందా? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర భుత్వానికి నిజాయితీ ఉందా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. విద్యుత్ కొనుగో ళ్లపై వేసిన కమిషన్ ఏమైందో ఎవ్వరికీ తె లియదన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్
ఇప్పటికీ రాలేదని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలన్నారు. లోపాయికారీ ఒప్పందం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసును ఎందుకు తూతూ మంత్రంగా నడిపిస్తు న్నారన్నారు. ప్రభాకర్ రావు డైరెక్ట్ ఐపీఎస్ అధికారి కాదు, ప్రమోటీ అని చెప్పారు. ఏం చెబితే అది చేస్తాడనే ఆయనను నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐబీ చీఫ్ గా నియమించార న్నారు. కేంద్రం ఆదేశాలను తుంగలో తొక్కి రిటైరయ్యాక కూడా ఆయనను కీలకమైన ఎస్ఐబీలో కొనసాగించారని చెప్పారు. బా ధ్యతాయుతమైన పోస్టులో ఐపీఎస్ అధికారిని నియమించకుండా రిటైరైన ప్రభాకర్ రావును కొనసాగించడం వెనక ఉద్దేశ్యం తమ చెప్పు చేతల్లో ఉంటాడనే అని వ్యాఖ్యానించారు. వాళ్లు ఈయన మీద చెబుతారు ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపత న్న, రాధాకిషన్ రావు తాము ప్రభాకర్ రావు ఏం చెబితే అది చేశామని చెబుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. ప్రభాకర్ రావు తాను ఇచ్చినవే కాకుండా వీళ్లంతా వేరే ఫోన్ నెంబర్లను ట్యాప్ చేశారని అంటున్నారన్నా రు. దీంట్లో సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల ఫోన్లు ఉన్నట్టు తెలిపారు. ఓ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న ఇంద్రసేనా రెడ్డితోపాటు జడ్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. 1975లో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి దేశాన్ని జైలుగా మార్చి కొంతమందిని అడ్రస్ లేకుండా చేసిన చీకటి అధ్యాయాలు మళ్లీ ఈ రూపంలో కనిపి స్తున్నాయన్నారు.
నా భార్య ఫోన్ను సైతం జమునా హేచరీస్ నడుపుతున్న తన భార్య ఫోన్ను కూడా ట్యాప్ చేశారని ఈటల
సమగ్ర విచారణ జరపాలి

రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను వేగవంతం చేయాలని ఈటల రాజేందర్ అన్నారు. సమగ్ర విచారణ జరిపి ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశాడన్నది నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజల హక్కులను సురక్షితం చేయాలన్నారు. ఈ వ్యవహారంలోని దోషులు ఎంతటి వారైనా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యంపై, ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ దమ్ము లేకపోతే మేమున్నాం కేసును సీబీఐకి అప్పగించండి అని అన్నారు. ఎంతటి వారైనా దోషులు ఎవరన్నది తేల్చి శిక్షించే సత్తా సీబీఐకి ఉందని చెప్పారు.
రాజేందర్ చెప్పారు. సంస్థలో పని చేస్తున్న విక్రమ్ రెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, సతీశ్, వేణుగోపా ల్ రెడ్డి తదితర ఫోన్లను ట్యాప్ చేసి మాటలు రికార్డు చేసినట్టు తెలిపారు. వారి మధ్య జరిగిన సంభాషణలను ఈ రోజు సిట్ అధి కారులు చూపించారన్నారు. తన భార్యతో మాట్లాడిన మాటలు కూడా రికార్డు చేశారని, ఇది అత్యంత నీచమైన చర్య అని వ్యాఖ్యానిం
చారు.
బీజేపీని దెబ్బ తీసేందుకే బీజేపీని దెబ్బ తీసేందుకే కేసీఆర్ ప్రభు త్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని బీజేపీ సీనియర్ నేత గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి
అన్నారు. సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లా డారు. రాజకీయ నేతల వ్యక్తిగత సంభాష ణలు, జర్నలిస్టులు, జడ్జిలు, సినిమా వాళ్ల ఫోన్ కాల్స్ వినడం దారుణమని వ్యాఖ్యా నించారు. ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితులు వేల సంఖ్యలో ఉండగా సాక్షులుగా కొద్దిమందిని మాత్రమే పిలుస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీ ఓటమి పాలైం దన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.

mp .eatala rajendar .

Read more

Local News