స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్.

ఎంపీ ఈవెల రాజేందర్
మరో అడుగు మేడ్చల్ – మల్కాజిరి జిల్లా ప్రతినిధి::: పొట్టకూటి కోసం నగరానికి వలన వచ్చి కూలీనాలీ చేసుకొని జీవిస్తున్న వారిపైన హైడ్రా పేరుతో తోడులు చేస్తే సహించేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మల్కా #రి ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. ఖరీదైన భూములను అక్రమ మార్గంలో సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్న బడా బాబులకు దోచిపె డుతున్న తీరుపై హైడ్రా ప్రభావం చూపుతోందని భావిస్తే భూ భకాసూరులను వదిలేసి 30 గజాలు, 60 గజాలలో గుడిసెలు వేసుకొని, చిన్న చిన్న ఇండ్లు నిర్మించుకున్న వారిపై విరుచుకుపడి వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యములో పేదలకు న్యాయం జరుగుతుందని ప్రగల్బాలు పలికే ప్రభుత్వ పెద్దలు చెపుతున్న మాటలకు కింద జరుగుతున్న తీరుకు పంతానలేదని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నీచ రాజకీయాలతో ఈ ప్రభుత్వం కాలం వెళ్ళదీస్తుందని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోరుబాట పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాలే కడుపు కోసం…
కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ కు స్థాని కులు తమ సమస్యలను తెలియజేశారు. ఏండ్ల తరబడి ఇక్కడి ఖాళీ స్థలాలలో నివాసాలు ఏర్పాటు చేసుకొని, కూలి నాని చేసుకొని జీవిస్తున్నామని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఓట్ల సమయంలో తప్ప తమను ప్రభుత్వాలు మనుషులుగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వసతులు కూడా కల్పించాలి ప్రభుత్వాలు, తాము పైసా పైసా కూడా పెట్టి నిర్మిం చుకున్న ఇండ్లను హైడ్రాతో కూలగొట్టిస్తుందని అవేదన వ్యక్తం చేశారు. లక్ష జనాభా కు పైగా నివాసం ఉ టున్న జవహర్ నగర్ లో మంచినీటి వసతి లేదని, ప్రభుత్వ అనుమతి ఉన్నత విద్యాలయలు లేవని ఈనెల దృష్టికి తీసుకువచ్చాడు. కనీస వసతులు లేకపోయినా కాలే కడుపు కోసం కూలీ చేసుకుంటూ జీవితాన్ని వెల్లదీస్తున్నామని స్థానికులు ఎంపీకి తెలిపారు. దుర్గంధంతోనే సహవాసం రోగాలతోనే జీవితం.
పేదల కోసమే మా పోరు బాట:
హైదరాబాద్ మహానగరంలోని చెత్తాచెదారాన్ని తీ సుకొచ్చి జవహర్ నగర్ లో ఉన్న డంపింగ్ యార్డులో పజేస్తున్నారని, దీనితో తీవ్ర దుర్గంధం వెలువడుతుందని జవహర్ నగర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అనునిత్యం అదే దుర్గంధపూరిత గాలిని పీలుస్తూ జీవితం గడుపుతున్నామన్నారు. ఇక్కడ చంపింగ్ యార్డ్ కారణంగా చుట్టుపక్క ప్రాంతాలన్నీ కాలుష్య
పూరిత ప్రాంతాలుగా మారిపోయాయి అని తెలిపారు. చెత్త చెత్త వరకు నుండి వెలుపడే మురికి నీరుతో ఇక్కడి భూగర్భ జలాలన్నీ విషపూరితమైనాయని, అనే నీటితో నిత్యం అవసరాలు తీర్చుకుంటున్నామని ప్రజలు భావోద్వేగంతో తెలియజేశారు. చిన్నారులు, వృద్ధులు పని ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరిని దీర్ఘకాలిక వ్యాధు లు బాధిస్తున్నాయని కొందరు బోరున విలపించారు. కిరాయిలు కట్టి బతకలేక, దుర్గంధంతో బాధపడుతూ భరించలేని రోగాలతో బతుకు భారంగా జీవిస్తున్నామని డంపింగ్ యార్డ్ సమీప బస్తివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇస్తూ, ప్రభుత్వంలోకి రాగానే తమను మరిచిపోతున్నారని, దీంతో తమ సమస్యలు నిరంతరం సమస్యలుగానే ఉంటున్నాయని అన్నారు. ఇంత దౌర్జన్యమా
జవహర్ నగర్ లో ఎప్పుడో ఎండ్ల క్రితం నిర్మించు కున్న ఇండ్లను ఇప్పుడు ఎందుకు కూలగొడుతున్నారో
ప్రజలకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. బంజారాహిల్స్ లో మీ నాయకులు కోట విలువైన భూములు కబ్జా పెట్టుకుంటే
జీవో నెంబర్ 58, 59 తీసుకొచ్చి క్రమబద్ధీకరిం చుకున్నారు. నిరుపేదలు నిలువ నీడ లేక గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇండ్లు నిర్మించుకుంటే మాత్రం పోలీసులను కాపలా పెట్టి రెవెన్యూ అధికారులతో, హైడ్రా పేరుతో ఇండ్లను పూలదొస్తున్నారు. ఇది ఏ రకమైన ప్రజాపాలననో ప్రజలకు చెప్పాలని ప్రభుత్వా న్ని నిలదీశారు. ఎప్పుడో గుడిసెలు వేసుకొని ఉన్నవారు ఇప్పుడు ఇండ్లు నిర్మించుకుంటుంటే హైట్ పేరుతో బస్తీల మీద పడి పీతల ఇండ్లను పూల కొడతారా. 30 గజాల్లో 60 గజాలలో ఇండ్లు నిర్మించుకునే వాళ్ళు పేదోళ్ల, ఉన్నోళ్ళ మీకు అర్థం కావడం లేదా లేక మీ మూర్ఖత్వానికి ఇది పరాకాష్టన అంటూ ప్రభుత్వాన్ని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. పేద ప్రజలకు అండగా హైడ్రా ఆగడాలకు బ్రేకులు వేసేందుకు పేదలకు అండగా బస్తీలలో పక్షిలాగా తిరుగుతున్నానన్నారు. హైడ్రా ఆహా ఓహో అన్నోళ్లం దరికీ మూడు నెలల్లో అర్థమైంది ఏంటంటే హైడ్రా కూలగొట్టింది పేదల ఇండ్లను తప్ప, పెద్దలవి రావని… కోర్టు తీరును గౌరవించని రేవంత్ రెడ్డి సర్కార్ పేదల బ్రతుకులను మాత్రం చిత్రం చేస్తుందన్నారు.

ఎవర్రా మీరు… ఖబడ్డార్ :
మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భూములపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏంటని మల్కాజ్గరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రశ్నించారు. టైగర్ నరేంద్ర, దత్తాత్రేయ, బద్దం బాల్ రెడ్డి వంటి నేతలు ఇక్కడి పేద ప్రజలకు ఇండ్ల జాగాలు ఇప్పించారని ఈ సందర్భంగా ఈటల గుర్తు చేశారు. ఇందిరమ్మ
రాజ్యం పేదల రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల గొట్టడం దారుణమన్నారు. పేదల పక్షాన త్వరలో త్వరలో పాదయాత్ర, బస్సు యాత్రలు చేసి ఈ ప్రభుత్వంపై పోరు సాగిస్తామని అన్నారు. కోటిన్నర జనాభా ఉన్న జవహర్ నగర్ లో నగరం నలుమూలల నుంచి చెత్తను తీసుకొచ్చి వేయడం సరికాదన్నారు. నగరం నాకు మూలలు ఉన్న శివారుకు చెత్తను తర లించడం మంచిదన్నారు. సొంత జాగాలో ఇల్లు కట్ట కుండా కొందరు అధికారులు అడ్డుకుంటూ లంచాలు డిమాండ్ చేస్తున్నారని తన దృష్టికి వచ్చిం దన్నారు. అధికారులు తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇక్కడి పేదలు తనదగ్గరికి వచ్చి తన గోడును చెప్పుకు న్నందుకే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ పిల్లల్ని కుక్కలు పిక్కుతుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇక్కడ దిక్కులేని నిరుపేదలకు అండగా ఎక్కడికైనా వచ్చి ప్రజల గొంతు వినిపిస్తానని ఈటెల తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అధికారులు బుద్ధిమంతులైతే ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. 10 ఇండ్లలో కేంద్రం పేదల ఇండ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేసినా అప్పుడు ఇక్కడ ఉన్న కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇవ్వలేదన్నారు. పేదల బస్తీల్లోకి కలెక్టర్ రావాలి పేదల ఇబ్బందులు తెలుసుకోవాలి
చిన్న జిల్లాలు ఉంటే ఉన్నత స్థాయి జిల్లా అధికారులు ప్రజలకు అందుబాటులోకి వస్తారని, పేదల బాధలు తీరుస్తారని భావిస్తే కొందరు అధికారులు మాత్రం ఆఫీసులను వదిలి రావడం లేదని ఎంపీ ఈటెల రాజేం దర్ ఆరోపించారు. జవహర్ నగర్ బస్తీలలో కలెక్టర్ సహా వివిధ శాఖల అధికారులు పర్యటించి ఇక్కడి పేదల కనీస మౌలిక సదుపాయాలపై అవగా హన తెచ్చుకుని పేదలకు న్యాయం చేయాలని సూచిం . ఇక్కడ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల లేక రోడ్లపైనే ఆడబిడ్డలు ప్రసవిస్తున్న దుస్థితి నెలకొందని అన్నారు. కుక్కలు పిల్లలను పీక్కు తింటున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ ప్రభాకర్, సుభాష్ రెడ్డి, బిజెపి నాయకులు మల్లారెడ్డి, విక్రమ్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, బుద్ధి శ్రీనివాస్, కార్పొరే టర్లు మహేశ్వర్ రెడ్డి, శేషగిరి, పవన్, సునీత, సురేందర్ యాదవ్. మల్లికార్జున్ బిజెపి నాయకులు, కార్యకర్తలు జవహర్ నగర్ ప్రజలు పాల్గొన్నారు.

