స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్ :

మహా విషాదం..
42 మంది కార్మికులు మృత్యువాత..
శవాలు కూడా గుర్తుపట్టలేనంతగా బూడిద గుట్టలు.. ఎముకల కల్లాలు..!
42 కు చేరుకున్న మృతుల సంఖ్య
శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగింపు
మరో రెండు గంటల పాటు శిధిలాల తొలగించే ప్రక్రియ కొనసాగే అవకాశం
కుప్పకూలిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ తోపాటు ప్రొడక్షన్ బిల్డింగ్
చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు బీహార్ జార్ఖండ్ కు చెందిన వారే..
వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 33 మంది క్షతగాత్రులు
మూడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు!
పేలుడు ధాటికి, శిథిలాల కింద పడి పలువురి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.
DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లుగా కలెక్టర్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
శిథిలాల కింద మరో 27 మంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే పాశమైలారం ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ పరిశీలించారు. అక్కడ కొనసాగుతోన్న సహాయక చర్యల గురించి అధికారులు, జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వప్ప గాయలైన క్షతగాత్రులను కూడా పరామర్శించారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివక్ వెంకట స్వామి, దామోదర రాజనర్సింహ తదితరులు ఉన్నారు.

