Tuesday, April 14, 2026

ఇవే.. తగ్గించుకుంటే మంచిది..!! – టీజీ వెంకటేష్

Share

లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలు నుంచి బెయిల్ పై వచ్చిన కవిత కాస్త ఆవేశం తగ్గించుకుంటే మంచిదంటూ మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ ఘాటుగా స్పందించారు. తమిళనాడులో శశికళలాగా అంతుతేలుస్తాం అంటూ కవిత సవాళ్ళు విసరడం సరికాదని.. వచ్చింది బెయిల్ మాత్రమే తప్ప కేసు కొట్టివేయలేదని కౌంటర్ ఇచ్చారు. ప్రతీకారం తీర్చుకోవాలంటే కేసీఆర్ ని కానీ కేటీఆర్ ని కానీ అరెస్ట్ చేసేవాళ్ళమని కేవలం కవితకు మాత్రమే ఈ పరిస్థితి ఏర్పడిందంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆమెకు సంబంధం ఉందికాబట్టే అని అన్నారు. మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అన్న వార్తలు హాస్యాస్పదమని ఒకవేళ అలాంటి ఆలోచనలే ఉంటే కవిత కామెంట్స్ మరోవిధంగా ఉండేవన్నారు. మరోవైపు గతంలో తాము సేకరించిన సమాచారం ప్రకారమే హైడ్రా పేరుతో సీఎం రేవంత్ అక్రమకట్టడాలను కూల్చివేస్తున్నారని.. ఏపీలో కూడా దీనిపై దృష్టి సారించాలని సూచించారు.

Read more

Local News