Tuesday, April 14, 2026

ప్రశాంతంగా పూర్తయిన నిమజ్జనం, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు- సీపీ ఆనంద్

Share

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలు ప్రశాంతంగా పూర్తయ్యాయని ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలని హైదరాబాద్ సీపీ ఆనంద్ పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్, ఐమాక్స్ దగ్గర గ్రౌండ్స్ లో విగ్రహాలకు పార్కింగ్ ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రజలకు రూట్ క్లియర్ చేయగలిగామని అన్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనుకున్న సమయానికే అయిందని, ఒక ప్రణాళిక ప్రకారం నిమజ్జనాలు నిర్వహించడంతో క్రిత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మూడు గంటలముందే నిమజ్జన ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఒక్క హుస్సేన్ సాగర్ లోనే దాదాపు 15వేల విగ్రహాల నిమజ్జనాలు జరిగాయని మొత్తం 11 రోజుల్లో కేవలం హుస్సేన్ సాగర్ లోనే లక్ష విగ్రహాలు నిమజ్జనం చేశారని వివరించారు. నిన్నరాత్రే ఓల్డ్ సిటీలో నిమజ్జనాలు పూర్తయ్యాయని, కొన్ని వాహనాలు బ్రేక్ డౌన్ కావడంతో ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాలు కొంత ఆలస్యమయ్యాయని లేకుంటే ఉదయం 7గంటలకే పూర్తయ్యేదని అన్నారు. ఈరోజు వర్కింగ్ డే కావడంలో ప్రజలకు సహకరించాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే అన్ని ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా నిమర్జనికి సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నామని, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

Read more

Local News