
కరీంనగర్ కి చెందిన మహమ్మద్ షాజాద్ ఖాన్ (27) సౌదీలోని ఎడారిలో దయనీయ స్థితిలో చనిపోయాడు. మూడు సంవత్సరాలనుంచి సౌదీ ఆరేబియాలోని అల్ హాసాలో టవర్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న షాజాద్ తన సహోద్యోగి సూడాన్ తో కలిసి 5రోజుల క్రితం కారులో ప్రయాణిస్తూ దారితప్పారు. GPS సరిగా పనిచేయకపోవడంతో రబ్ అల్ ఖాలీ అనే ప్రమాదకరమైన ఎడారిలోకి వెళ్ళిపోయారు. ఫోన్ బ్యాటరీ అయిపోవడం, పెట్రోల్ కూడా లేకపోవడంతో దాదాపు నాలుగు రోజుల పాటు ఎడారిలో ఇద్దరూ చిక్కుకుపోయారు. తరువాత ఇద్దరి మృతదేహాలు వారి కారుపక్కన కనిపించాయి. డీహైడ్రేషన్, విపరీతమైన ఎండతో పూర్తిగా బలహీన పడి ఇద్దరూ ప్రాణాలు వదిలినట్లు నిర్ధారించారు. మరోవైపు 650 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన రబ్ అల్ ఖలి ఎడారి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఒకటిగా చెప్తారు.

