Friday, April 17, 2026

SBI చైర్మన్ గా తెలంగాణ బిడ్డ

Share

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 27వ చైర్మన్ గా తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు. SBI చైర్మన్ దినేశ్ ఖారా పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో శ్రీనివాసులు శెట్టి బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకూ SBIకి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన శెట్టి బ్యాంకింగ్ రంగంలో ఎంతో నైపుణ్యతను ప్రదర్శించారు. తనకున్న అపారమైన అనుభవంతో కార్పొరేట్ బ్యాంకింగ్, స్ట్రెస్డ్ అసెట్స్ మరియు రిటైల్ బ్యాంకింగ్‌లను నిర్వహించారు. 1988లో ఎస్‌బిఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన 59 ఏళ్ల శెట్టి ఇప్పుడు దేశంలోని అతిపెద్ద బ్యాంక్‌లో అత్యున్నత పదవిని చేపట్టి తెలుగువారికి గర్వకారణంగా నిలిచారు. 50 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్న SBIని అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా నిలుపుతామని. మరింత లాభాలను సాధించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.

Read more

Local News