స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్ :
పూర్తైన జర్నలిస్టు స్వేచ్ఛ పోస్టుమార్టం:

హైదరాబాద్ జవహర్ నగర్ లో జర్నలిస్టు స్వేచ్ఛ (Journalist Swetcha) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీక హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు వైద్యులు స్వేచ్ఛ మృతదేహానికి గంటపాటు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వైద్యులు సంచలన విషయాలు తెలిపారు.
“మా వద్దకు స్వేచ్ఛ మృతదేహం ఈ రోజు ఉదయం 11.46 నిమిషాలు వచ్చింది. గంటలో పోస్టుమార్టం అయిపోయింది. ఆమె ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. గొంతుపై ఉరివేసుకున్న గుర్తులు ఉన్నాయి. మంచం మీద స్టూల్ పెట్టుకుని లుంగీతో ఉరివేసుకున్నారు. చనిపోయిన తర్వాత కాళ్లు మంచానికి తగలడంతో కలర్లో మారిపోయాయి. దాడి చేసినట్లు గాయాలు లేవు. ఉరివేసుకున్న తర్వాత మూడు కేజీలు బరువు తగ్గింది. మూడు నిమిషాల్లోనే చనిపోయారు. ఉరి వేసుకునే యాంకర్ స్వేచ్ఛ చనిపోయారు. ఉరి తర్వాత నాలుక కూడా కొరుక్కున్నారు. మెడ దగ్గర బ్లడ్ సరఫరా ఆగిపోతుంది. నోటి వెంట బ్లడ్ కారడం మామూలే. స్వేచ్ఛ కాళ్లు, ముఖంపై ఎలాంటి గాయాలు లేవు. స్వేచ్ఛ స్టమక్ నుంచి శ్యాంపిల్స్ తీసుకున్నాం. పురుగుల మందు లాంటివి తీసుకోలేదు. ఎల్లో ఫుడ్ తీసుకున్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. స్మెల్ వస్తోంది… ఫుడ్ ఏంటనేది ల్యాబ్ రిపోర్టు వస్తే తెలుస్తుంది. స్వేచ్ఛ నుంచి కిడ్నీ, లివర్, కొంచెం స్టమక్ శ్యాంపిల్స్ తీసుకుని ల్యాబ్క పంపాం. 2, 3 నెలల్లో రిపోర్టు వస్తుంది. అనుమానాలు ఉంటే రిపోస్టుమార్టం చేసుకోవచ్చు. గాంధీ ఆస్పత్రికి 11.46 నిమిషాలకు స్వేచ్ఛ డెడ్ బాడీ వచ్చింది. గంట పాటు మా టీమ్ పోస్టుమార్టం నిర్వహించాం. ఫొటోలు తీశాం. వీడియో గ్రఫీ తీయలేదు. ప్రత్యేకమైన కేసుల్లో మాత్రమే వీడియో గ్రఫీ తీస్తాం. స్వేచ్చ ఉరివేసుకోవడంతో గొంతు కమిలిపోయింది.” అని వైద్యులు పేర్కొన్నారు.

మృతురాలి తండ్రి స్వేచ్చ వోటార్కర్ ఆత్మహత్య విషయంలో సంచలన ఆరోపణలు:
ఈ క్రమంలోనే మృతురాలి తండ్రి స్వేచ్చ వోటార్కర్ ఆత్మహత్య విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. తమ కూతురు చనిపోవడానికి ప్రధాన కారణం పూరచందర్ అనే వ్యక్తేనని అన్నారు. భర్తతో విడిపోయాక తన కూతరు అతడితోనే కలిసి ఉంటోందని తెలిపారు. వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో పూరచందర్ తో కలిసి ఉండలేను నాన్న అంటూ తన కూతురు జూన్ నెలలో చెప్పిందని అన్నారు. స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచందర్ మాటిచ్చి ఆమెతో సహజీవనం చేశాడని.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో కాలయాపన చేస్తూ వచ్చాడని ఆరోపించారు. ఈ విషయంలోనే తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని.. అందుకు కారణమైన పూర్ణచందరు కఠినంగా శిక్షించాలి స్వేచ్ఛ తండ్రి డిమాండ్ చేశారు.

