Tuesday, April 14, 2026

కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఈటల

Share

కళ్యాణలక్ష్మీ పథకం కింద చేస్తున్న చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మేడ్చల్, బాలాజీ నగర్, దమ్మాయిగూడ మూడు మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న ఆడపిల్లలకు ఈ పథకం కింద లక్షరూపాలయ చెక్కులను అందించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, బాలాజీ నగర్ మేయర్ శాంతి కోటేశ్, కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోయే కాలంలో పెళ్లిపందిరిలోనే చెక్కులు అందించే పద్దతి ఉంటే పేదలకు మరింత మంచి జరిగే ఆస్కారం ఉందని ఇందుకోసం ప్రభుత్వం తగిన విధానాలు అమలు చేయాలని కోరుతున్నామని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అన్నారు.

Read more

Local News