Friday, April 17, 2026

బీసీలకు అన్నిరంగాల్లో అన్యాయం- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

Share

తెలంగాణలోని అన్నిరంగాల్లో బీసీలు అన్యాయానికి గురవుతున్నారని కుల గణన చేయకపోతే రాష్ట్రంతో పాటు దేశంలో బీసీ నాయకులతో కలిసి అగ్గిపుట్టిస్తామంటున్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన బీసీల సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలతో పాటు సత్యాగ్రహ దీక్ష ఆలిండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రానున్న కాలంలో మరిన్ని సభలు పెట్టి బీసీలలో చైతన్యం తీసుకువస్తాంమని అన్నారు. ఈ దీక్షలో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్ జాతీయ అధ్యక్షుడు కిరణ్, తెలంగాణ అధ్యక్షుడు శివ ముదిరాజ్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇందిరా శోభన్ లతో పాటు పలు బిసి సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read more

Local News