Saturday, May 2, 2026

హైడ్రా పేరిట పేదల జోలికి వస్తే… ఖబర్దార్ నా కొడకా : ఈటల

Share

నల్లగొండ జిల్లా కేంద్రంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అహంకారం మీద, చెప్పే మాటకి చేసే పనికి పొంతనలేదని గుద్దుడు గుద్దారు. మళ్లీ రేవంత్ రెడ్డిని తెచ్చారు. ప్రజలకు కెసిఆర్ పోవాలని కనపడింది తప్ప ఇంకా ఏమి కనపడలేదు. వాళ్లు పోయారు వీళ్లు వచ్చారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూనప్పుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి అయితడంట, సంతకం పెడతాడంట, అన్ని ఇస్తాడంట అని చెప్పి అనుకున్నారు. 2000 పెన్షన్ ని 4000 చేస్తానని చెప్పాడు, 9 నెలలు అవుతుంది ఒక్కరికన్నా 4000 పెన్షన్ వచ్చిందా.. కొత్త వాళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పిండు వచ్చాయా… చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు వచ్చాయా.. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పాడు వచ్చాయా… మొట్టమొదట రోషం రావాల్సింది ఈ జిల్లాకి.

మెదక్ జిల్లా రైతు ఉపాధి కోసం వచ్చి ప్రైవేటు జీతంతో బతుకుతున్నాడు. ఆయన ఒక చిట్టి రాసి మేడ్చల్ ఎంపీడీవో ఆఫీస్ ముందు ఉరివేసుకొని చనిపోయాడు. ఇవి పేపర్లో రాకుండా రేవంత్ రెడ్డి మాయ చేస్తున్నాడు. ఆ రైతు ఆవేదన ఏంటంటే.. మా అమ్మ, నేను ఒకే రేషన్ కార్డులో ఉన్నాం మా అమ్మ పేరు మీద 90000 అప్పు, నా పేరు మీద రెండు లక్షల అప్పు ఉంది, రేవంత్ రెడ్డి గారు నా కుటుంబం ఏర్పడి చాలా రోజులవుతుంది మా అమ్మ వేరు నేను వేరు అని దరఖాస్తు పెట్టుకున్నాము, కానీ కనికరం రాలేదు. నాకు రుణమాఫీ కానందుకు నా జీవితం మీద విరక్తి చెంది, నా అప్పులు తీర్చలేని భావించి నేను ఉరేసుకుంటున్న అని ఉత్తరం రాసి చనిపోయాడు.
మొన్న ఒక రైతు మందు తాగి చనిపోయాడు. నాగర్ కర్నూల్ లో ఇంకో రైతు తుమ్మ చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు.

మొన్న వరద ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రాకాసి తండలో 9 ఫీట్ల వరకు వరద నీరు వచ్చింది. వారం రోజులు అవుతుంది, ఇప్పటికీ మాకు ఒక రూపాయి కూడా అందలేదు మేము ఎలా బతకాలి అని కన్నీళ్లు పెడుతున్నప్పుడు నాకు దుఃఖం వచ్చింది.
మూడు నెలలకే ప్రజలను మోసం చేసి, వంచించి, ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవునో కాదో మొట్టమొదట తేల్చాల్సింది నల్లగొండ జిల్లా.
12 అసెంబ్లీ స్థానాల్లో 11 గెలిపించారు, పార్లమెంట్లో అన్ని స్థానాలు గెలిపించారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చిన సీటు కూడా నల్లగొండ పార్లమెంట్ సిటే. మొత్తం తెలంగాణలో చైతన్యవంతమైన జిల్లా కూడా ఈ జిల్లానే కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గ్యారెంటీ లపై చర్చ పెట్టాలని కోరుతున్నాను.

మిస్టర్ రేవంత్ రెడ్డి.. రైతులకు ఏ హామీ అయితే ఇచ్చావో 2 లక్షల రూపాయలు చేసేంతవరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని పిడికిలి బిగించే సందర్భం ఆసన్నమైంది.

రైతుబంధు వచ్చిందా… ఇవాళ మొదటి పంట కూడా అయిపోవడానికి వచ్చింది. రైతుబంధు ఇస్తాడా లేదా అని కూడా చెప్పడం లేదు. రైతుబంధు కు ఇవ్వాల్సిన పైసలే రైతు రుణమాఫీ చేశాడు.

భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటుంది. ఎక్కడ కూడా మాట తప్పిన ప్రభుత్వం కాదు ఇది.

ఇదే ప్రభుత్వం హైదరాబాదులో హైడ్రా పేరిట పేదల జోలికి వస్తే… ఖబర్దార్ నా కొడకా అని చెప్పి హెచ్చరించి మీ వైపు నిలబడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ.
ఈ రాష్ట్రంలో మాకు అధికారం లేకపోవచ్చు కానీ ప్రజల పక్షాన బరిగీసి కొట్లాడే శక్తి కలిగిన పార్టీగా ఇవాళ ప్రజలు చూస్తున్నారు.

మూసీ నదిని ప్రక్షాళన చేస్తానని చెప్పి అక్కడున్న పేద ప్రజల జోలికి వస్తున్నాడు… ముందు పేదలకు ఇల్లు కట్టించు లేకపోతే వారిని తీయగలిగే దమ్ము నీకుందా అని నేను అన్నాను.

ఇంకో రెండు మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీకు నాయకత్వం వహించే బాధ్యత మాదే, బరి గీసి కొట్లాడే బాధ్యత కూడా మాదే.

నల్లగొండ జిల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సభ్యత్వ నమోదు చేయించాలి.

ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారు, జిల్లా సభ్యత్వ ప్రముఖ విద్య సాగర్ రెడ్డి గారు, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయాక్ గారు, మాజీ జిల్లా అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, ధర్మ రావు గారు, గోలి మధుసూదన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, కళ్యాణ్ నాయక్ గారు, నూకల నరసింహారెడ్డి గారు, కంకణాల శ్రీధర్ రెడ్డి గారు,
పల్లెబోయిన శ్యాంసుందర్ గారు, లాలు నాయక్ గారు, బండారి ప్రసాద్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మోర్చా రాష్ట్ర నాయకులు, బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Read more

Local News