Tuesday, April 14, 2026

మనమంతా నిమిత్తమాత్రులమే… జన్మాష్టమి వేడుకల్లో ఈటల

Share

మనం నిమిత్తమాత్రులం. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ పదవి , అధికారం నిన్న వేరేవారిది.. రేపు ఇంకొకరిది.. అందుకే సంపద, సుఖం ఏది ఎప్పుడూ శాశ్వతం కాదని చెప్పిన మహానీయుడు శ్రీకృష్ణ భగవానుడు అని “శ్రీకృష్ణ జన్మాష్టమి” వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పీర్జాదిగూడ లోని ఆర్కే యువభారత్ ఫౌండేషన్, నాగారం లోని సిరినిటి స్కూల్, మచ్చబొల్లారంలో నిర్వహించిన జన్మాస్టమి వేడుకలకు ఈటల హారజరయ్యారు. గీతసారాంశాన్ని మానవాళికి అందించిన మహనీయుడు శ్రీకృష్ణుడని.. మనిషిని మనిషిగా ప్రేమించడం, గౌరవించడం, సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే మానవత్వం చాటే మనిషిగా తాను ఉండాలని కోరుకుంటున్నానన్నారు.. గతంలో పిలిస్తే పలికే బిడ్డగా ఉంటానని మాట ఇచ్చానని దాన్ని ఎన్నటికి నిలబెట్టుకుంటానని అందుకే గత ఎనిమిది నెలలుగా ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యలు నేరుగా తెలుసుకునే ప్రయతం చేస్తున్నానని తెలిపారు. భారీ మెజారిటీతో గెలిచిన తనకు అనేకమంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు కానీ గెలిచింది మల్కాజ్ గిరి ప్రజలేనని మరోసారి గుర్తుచేసిన ఆయన ప్రతి ఒక్కరికి జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more

Local News