ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయింది.70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతి భక్తుల కోలాహలం మధ్య గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. స్వామి నిమజ్జన్నాన్ని వీక్షించేందుకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వేలల్లో తరలివచ్చిన గణనాధుల విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 71ప్రాంతాల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయగా ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు 25వేల మంది పోలీసులు విధులు నిర్వర్తించారు.


