SBI తన ఆశా స్కాలర్ షిప్ ప్రొగ్రామ్ 3వ ఎడిషన్ ను ప్రారంభించింది. ఆర్ధికంగా వెనకబడి అర్హులైన పదివేల మంది విద్యార్ధులకు దీని ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తోంది. 6వ తరగతి నుండి పీజీ వరకూ విద్యార్ధులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. వారి విద్యాస్థాయిని బట్టి ఏడాదికి పదిహేను వేలనుంచి ఇరవై లక్షల వరకూ స్కాలర్ షిప్ అందిస్తుంది. అక్టోబర్1, 2024 లోపు www.sbifashascholarship.org సైట్ ద్వారా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా దేశం మొత్తంమీద ఇప్పటివరకూ దాదాపు మూడువేల మంది విద్యార్ధులకు రూ.3.91కోట్ల ఆర్ధిక సహాయాన్ని ఎస్ బి ఐ అందించింది.
Share
Read more

