Saturday, April 18, 2026

భారీ బోటును ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు

Share

ప్రకాశంబ్యారేజీ దగ్గర బోట్లు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఏడురోజుల నిరంతర శ్రమ అనంతరం 40టన్నుల భారీ బోటును బెకెం ఇన్ఫ్రా సంస్థ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. నాలుగు భారీ పడవల సహాయంతో బోటును బయటకు లాగారు. భారీ ప్రవాహానికి ఎగువనుంచి కొట్టుకువచ్చి బ్యారేజీని ఢీకొట్టిన ఈ భారీ పడవల తొలగింపుకు వివిధ టీంల నిపుణులు, సిబ్బంది ఇప్పటికే అనేక రకాల ప్రయత్నాలు జరిపారు. ఇంకా బ్యారేజీ దగ్గర రెండు భారీ,ఒక మోస్తరు బోటు అడ్డుపడి ఉన్నాయి. మొదటిబోటును ఒడ్డుకుచేర్చిన విధానంలోనే నేడు మిగిలిన 3బోట్లను కూడా తొలగించే ప్రయత్నం కొనసాగించనున్నారు.

Read more

Local News