Tuesday, April 14, 2026

వికసిత భారత్ సంకల్ప సభ విజయవంతం

వికసిత భారత్ సంకల్ప సభ విజయవంతం

Share

ఎంపీగా ఒక సంవత్సరం కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా వికసిత భారత్ సంకల్ప సభను విజయవంతంగా నిర్వహించినందుకు ఎంపీ ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపిన పలువురు బీజేపీ నాయకులు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ :
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా జిల్లా అధ్యక్షులు, నాయకులు నర్మద, దీపిక మరియు గౌరవ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు అందరికీ పేరుపేరుపేరునా ధన్యవాదాలు.

శ్యామ ప్రసాద్ ముఖర్జీ దగ్గర నుండి మోదీ గారి వరకు సాధించిన విజయాలన్నీ ఎక్సిబిషన్ లో పెట్టాము.

నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మోదీ గారితో అనేకసార్లు సమావేశం అయ్యాము. GST అమలు తీరు పరిశీలనకోసం ఆస్ట్రేలియ వెళ్ళాము. వాళ్ళు మా దేశంలో అక్షరాస్యత ఎక్కువ, టాక్స్ ఎక్కువ కడతారు, రాజకీయ చైతన్యం ఉంది మీదగ్గర ఇవేమీ లేదు మీరెలా అమలు చేస్తారు, అమలు చేస్తే మా ప్రభుత్వం కూలిపోయింది అని చెప్పారు.
మోడీ గారు పవర్ ఓరియెంటెడ్ కంటే పీపుల్ ఓరియెంటెడ్ మనిషి అని మేము చెప్పాము.
జీఎస్టీ ని అమలు చేసే దమ్ము కాంగ్రెస్ కి లేకపోతే మోడీ గారు అమలు చేసి చూపించారు.
అప్పుడు టాక్స్ 73 వేల కోట్లు వస్తె 2.40 లక్షల కోట్లకు పెరిగింది.
మోడీ చేతులు ఊపి నాయకుడు కాలేదు చెమటోడ్చి కష్టపడ్డారు.
కరోనా సమయంలో పలుదేశాల అధ్యక్షులు కంటతడి పెడితే మోడీ భారత ప్రజలకు ధైర్యం నింపారు.
81 కోట్ల మందికి ఐదు కిలోల బియ్యం పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు.

ఆపరేషన్ సింధూర్ తో మన సత్తాచాటారు.

కాంగ్రెస్ స్కాముల మయం.
సొంతమంత్రులు జైలుకెళ్లిన నికృష్ఠ మైన పాలన వారిది.

మాతాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని వాళ్ల చరిత్రను సొమ్ము చేసుకొనే ప్రయత్నం
కొంతమంది చేస్తున్నారు.

మొదటి స్కామ్ మిలటరీ జీపులు కొనుక్కున్న స్కామ్ వారిది.

బలిదానాల ఫలితం తెలంగాణ.

రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఖతం పట్టించారు.

బీజేపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు.
ఆ పేరుతో అవినీతికి వ్యతిరేకం.

కేసీఆర్ అహంకారంతో మోదీ ఏం ముఖం పెట్టుకొని వస్తావని ప్రశ్నించారు.ఇదే వ్యక్తి మోడీని అసెంబ్లీ లో పొగిడారు. కళ్లునెత్తికి ఎక్కి విమర్శలు చేసారు.

నాయకుడు ఉంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేందుకు మోదీ గారి పాలన ఉదాహరణ.

డిజీటాల్ ట్రంజక్షన్ లో అమెరికాకంటే ముందున్నాము. మనమే నంబర్ 1.

భారత్ విశ్వగురు స్థాననానికి ఎదిగింది.

సౌదీలో కూడా మన వారికోసం దేవాలయం కట్టించారు.

కొంతమందికి సంచలనం కోసం మాట్లాడుతుంటారు.
వర్క్ విల్ స్పీక్.
అదే మోదీ గారి పాలసీ కూడా.

జమ్ములో ఒకే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఆయన ఆశయాన్ని సాధించింది మోదీ గారు.

నేను ఇక్కడ ఎంపీ అయినందుకు గర్వ పడుతున్న.
సరూర్ నగర్ కార్పొరేటర్ చెప్పింది.. మీ వాళ్ల మా లెటర్ ప్యాడ్ మీద రెండున్నర కోట్లు నిధులు వచ్చాయని చెప్పడం నాకు సంతోషాన్ని ఇచ్చింది.

రాజకీయాలు శాశ్వతం కాదు
మానవ సంబంధాలు శాశ్వతం.
ప్రజల అభివృద్ధి శాశ్వతం.

గ్రామాలలో ఇచ్చే ప్రతి రూపాయి కేంద్రం ఇచ్చేదే.
స్మార్ట్ సిటీ, అమృత్ నగరాలు ఎవరు తెచ్చారు బాబు.
రోడ్లు అన్నీ కేంద్రమే నిర్మిస్తుంది,
కళ్ళులేని కబోదులు వారు.

చివరగా మరోసారి..
బీజేపీ ప్రాజెక్ట్స్ కి వ్యతిరేకం కాదు,
అవినీతికి వ్యతిరేకం.
ghmc ఎన్నికల్లో మల్కాజిగిరి గడ్డమీద బీజేపీ జెండా ఎగురుతుంది.

  • ఈటల రాజేందర్.

Read more

Local News