Tuesday, April 14, 2026

గ్రేటర్ (GHMC) లో భారీగా మార్పులు

గ్రేటర్ (GHMC) లో భారీగా మార్పులు

Share

స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్ ఆర్వీ కర్ణన్ మార్కు పాలన మొదలైంది. అందరూ ఊహించినట్లుగానే అడిషనల్ కమిషనర్లలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు చేస్తూ గురువారం కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జీహెచ్ఎంసీలో 14 మంది అడిషనల్ కమిషనర్లు ఉండగా, ప్రస్తుతం 6 గురికి మాత్రమే బాధ్యతలు ఇచ్చి మిగతా వారిలో కొందరిని జాయింట్ కమిషనర్లు పోస్టింగ్స్ ఇవ్వడంతో పాటు ఇద్దరిని జీహెచ్ఎంసీ నుంచి తిరిగి సీడీఎంఏకు పంపించారు. వీరితో పాటు ఇటీవల బదిలీపై వెళ్లిన ముగ్గురు అడిషనల్ కమిషనర్ల విభాగాలను కూడా ఇతరులకు కేటాయించారు.

ప్రస్తుతం రెవెన్యూ, ఐటీ విభాగాలకు అడిషనల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతికి అడ్వేర్టైస్మెంట్ విభాగం బాధ్యతలు అప్పగించారు. అలాగే అడిషనల్ కమిషనర్(అర్బన్ బయోడైవర్సిటీ) సుభద్రదేవికి అదనంగా క్రీడావిభాగం బాధ్యతలు సైతం అప్పగించారు. శానిటేషన్, హెల్త్ అడిషనల్ కమిషనర్గా రఘుప్రసాద్ కి బాధ్యతలు ఇచ్చారు. అలాగే ఇదివరకు హెల్త్ అడిషనల్ కమిషనర్ గా ఉన్న పంకజను ఆ విభాగం నుంచి తప్పించి అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ అడిషనల్ కమిషనర్ గా నియమించారు.అలాగే సరోజను డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎంక్వెరీస్ అడిషనల్ కమిషనర్ గా నియమించారు. ప్రస్తుతం ఎలక్షన్స్ అడిషనల్ కమిషనర్ ఉన్న అలివేలు మంగతాయారుకు ఎస్టేట్స్ విభాగాన్ని అదనంగా కేటాయించారు. దీంతో పాటు ఎలక్ట్రికల్ అడిషనల్ కమిషనర్ గా కొనసాగిన వేణుగోపాల్ రెడ్డిని శానిటేషన్-1 జాయింట్ కమిషనర్ గా, ఎస్టేట్ అడిషనల్ కమిషనర్ గా కొనసాగిన అశోక్ సామ్రాట్ కు శానిటేషన్-2 జాయింట్ కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించారు. వీటితో పాటు హెరిటేజ్ భవనాలకు సంబంధించిన అంశాన్ని చీఫ్ సిటీప్లానర్ (సీసీపీ)కి కేటాయించారు. స్ట్రీట్ లైట్స్ విభాగాన్ని చీఫ్ ఇంజినీర్(నిర్వహణ)కు, హౌసింగ్ విభాగాన్ని చీఫ్ ఇంజినీర్ (హౌసింగ్)కు కేటాయించారు. దీంతో పాటు జాయింట్ కమిషనర్ (హెల్త్)గా ఎన్.శంకర్, కుడా కార్యదర్శిగా ఉన్న రమాదేవిని జాయింట్ కమిషనర్(ఎలక్షన్స్) విభాగాన్ని కేటాయించారు. గతంలో జాయింట్ కమిషనర్(హెల్త్)గా పనిచేసిన జయంత్ రావుకు జాయింట్ కమిషనర్(కో ఆర్డినేషన్)గా నియమించడంతో పాటు ఆయనకు మెట్రోపాలిటన్, అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కార్యదర్శి పేషీలో పనిచేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

CDMA కు సరెండర్:స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్న యాదగిరిరావు, హౌసింగ్ అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్న నళిని పద్మావతిలను జీహెచ్ఎంసీ నుంచి రిలీవ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.

GHMC Commissioner RV Karnan

Read more

Local News