Tuesday, March 17, 2026

మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్.

Thretaning Call to MP Raghunandan Rao

Share

స్వేచ్ఛ, హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ‘ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి అగంతకుడు ఫోన్ చేసినట్లు సమాచారం. ఫోన్ కాల్ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్ పాల్గొన్నారు.

బెదిరింపు కాల్తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read more

Local News