Tuesday, April 14, 2026

వన్ నేషన్ ఒన్ ఎలక్షన్- జమిలి ఎన్నికలకు ఆమోదం..

Share

నేడు మోడీ కేబినేట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలకు ఆమోదముద్ర పడింది. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు అడుగుముందుకేస్తూ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేంద్ర కేబినేట్ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రభుత్వ పాలనలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటన చేశారు. ఇంతకీ ఈ ఎన్నికల తీరుతెన్నులేంటంటే.. అన్నిరాష్ట్రాల్లోని అసెంబ్లీలతో పాటు లోక్ కభకు కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడమే జమిలీ ఎన్నికలు. ఇప్పటికే ప్రస్తుతం జరిగే ఈ పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెడతారంటూ అనేక కథనాలు వినిపించాయి.. పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని దీనికోసం లోక్ సభలోని 543 స్థానాల్లో కనీసం 67శాతం మంది సభ్యులు, రాజ్యసభలోని 245సీట్లలో 67శాతం మంది సభ్యులు ఈ బిల్లుకు సానుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతోపాటు దేశంలో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు జమిలీ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంటుందని ఇదంత తేలికైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ నేడు కేంద్ర కేబినేట్ జమిలీ బిల్లుకు పచ్చజండా ఊపడంతో సర్వత్రా ఆశక్తి నెలకొంది.

Read more

Local News