ఉదయం జరిగిన అప్ శాశనసభ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు అతిషిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. విద్య, పీడబ్ల్యూడీ శాఖల మంత్రిగా ఉన్న అతిషీ ఆప్‌లో కేజ్రీవాల్ తరువాత ముఖ్యనేతగా పేరుదక్కించుకున్నారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రతినిధిగా వ్యవహరించారు. 2020 ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆమె.. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని, ప్రతిష్ఠాత్మక రోడ్స్ స్కాలర్‌షిప్ కూడా సాధించారు. మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా అరెస్టయిన తర్వాత విద్యా శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సాయంత్రం కేజ్రీవాల్ రాజీనామా అనంతరం ఆమె ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. ఇక సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా అతిషి మూడవస్థానాన్ని దక్కించుకున్నారు.


