Tuesday, August 11, 2026

ప్రియురాలిపై కత్తిదాడి

Share

గచ్చిబౌలీ గోపన్ పల్లి తండాలోని ఓ సెలున్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తున్న దీప్తి అనే యువతిపై ఆమె ప్రియుడు రాకేష్ కత్తితో దాడి చేసి పరారయ్యాడు. అర్ధరాత్రి రక్తపు మడుగులో పడిఉన్న దీప్తిని స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అనంతరం ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కలకత్తాకు చెందిన దీప్తి పై దాడికి పాల్పడిన వ్యక్తి రాకేష్ గా గుర్తించారు. గతంలో వీరిద్దరూ ఒకే సెలూన్ పనిచేయగా అక్రమసంబంధమే ఈ దాడికి కారణమని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more

Local News