Tuesday, April 14, 2026

సామన్యుల భూముల జోలికొస్తే ఊరుకోం- ఈటల

Share

హైదరాబాద్ అక్రమ కట్టడాలపై చేపట్టిన చర్యలు సంతోషకరమైనవే కానీ సామాన్యులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమంటున్నారు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్. చెరువుల చుట్టూ ఉన్న పట్టా భూముల్లో కట్టుకున్న పేదల ఇళ్ళు కూడా కూలుస్తామంటున్నారని..ఈ విధంగా భయభ్రాంతులకు గురిచేస్తూ సాహెబ్ నగర్, సరూర్ నగర్, ఫాక్స్ సాగర్ లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేయడం కరక్టేనా అని సీఎం రేవంత్ ను ప్రశ్నిస్తున్నామన్నారు. హీరోలా ఫోజులు కొట్టే పద్దతి మంచిది కాదని గతంలో పర్మిషన్ ఇచ్చిన అధికారులు కూడా మీవారే అని మర్చిపోవద్దని అన్నారు. బతకమ్మ కుంటను పూడ్చింది ప్రభుత్వం కాదా అని దమ్ముంటే ప్రభుత్వమే పూడ్చిన చెరువుల మీద చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం పూడ్చివేసిన చెరువులు ఎన్నో లెక్క తేల్చాలని అన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అయ్యప్ప సొసైటీలో భూములకు కూల్చే ప్రయత్నం చేసి మళ్లీ తోక ముడిచారని ఆతరువాత ఏం జరిగిందో చూశామని అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న పని గొప్పదని సమర్ధిస్తే ప్రమాదం ఉంటుందని 30 ఏళ్ల క్రితం పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలకు సోయి ఉంటే నదుల, చెరువుల పక్కన ఉన్న పట్టా భూములు సేకరించి నష్టపరిహారం చెల్లించి ఉంటే ఈరోజు ఈ ఆక్రమణలు ఉండేవి కావని అభిప్రాయపడ్డారు.

Read more

Local News