ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసింది. మూడున్నర ఎకరాలు తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు.

హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా ను తీసుకొచ్చారు. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు. అధికారులు నగరాన్ని జల్లెడ పట్టి నిత్యం ఏదో ఒక చోట ఆక్రమణలను కూల్చివేయడం కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

