
అద్దె చెల్లించకపోతే ఇళ్ళకే కాదు.. డబ్బులుండే ఏటీఎంలకు కూడా తాళాలు పడతాయి. కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్ళే దారిలో ఓ ఎస్ బి ఐ ఏటిఎంకు ఆ రూమ్ ఓనర్ తాళాలు వేశారు. అద్దె చెల్లించకపోవడంతో మూసివేయబడింది (closed due to non payment of houserent) అని ఓ నోటీస్ అంటించారు. దీంతో మనీ డ్రా చేసుకునేందుకు వచ్చిన కస్టమర్లు ఈ బోర్డు చూసి తిరిగి వెళ్తున్నారు.

