Saturday, April 18, 2026

మందుబాబుల మీద దోమల ప్రేమ

Share

తరచు మద్యం సేవించేవారుంటే దోమలకు పండగే అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. తమనే దోమలు ఎక్కువగా ఎందుకు కుడతాయన్న మందుబాబుల సందేహానికి చెక్ పెట్టింది జపాన్ టొయామా యూనివర్శిటీ.

బయోడిఫెన్స్ మెడిసిన్ విభాగం నిర్వహించిన ఓ అధ్యయనంలో బీర్ తాగేవారిని దోమలు ఎక్కువగా కుడతాయని తేలింది. బీర్లు తాగడం వల్ల శరీర ఉష్టోగ్రత పెరగడంతో పాటు వారు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ చెమట దోమలను ఆకర్షిస్తాయని వెల్లడైంది. అందుకే వీరిని మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువగా దోమలు కుడతాయని పరిశోధకులు చెప్తున్నారు.

Read more

Local News