
తిరుమల లడ్డూ విక్రయంలో ఓ స్పష్టతను తీసుకొచ్చింది టీటీడీ. దర్శనం లేకుండా లడ్డూలు మాత్రమే తీసుకోవాలనుకునేవారికి రెండు లడ్డులకు మించి కొలుగోలు చేసే అవకాశం లేదని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. లడ్డూ బ్లాక్ మార్కెట్ పై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని అంతేకాదు సంచీలతో లడ్డూలను తీసుకెళ్ళడం తమ కళ్ళారా చూసామని అన్నారు. మధ్యవర్తులు, దళారుల చేస్తున్న లడ్డూల బ్లాక్ మార్కెట్ ను నిర్మూలించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దర్శనం చేసుకున్న వారికి ఒక ఉచిత లడ్డూ ప్రసాదం తో పాటు కావాల్సిన లడ్డూలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుందని.. కానీ దర్శనం లేకుండా కేవలం లడ్డూ మాత్రమే తీసుకోవాలనుకునేవారు ఆధార్ కార్డు చూపించి రెండు లడ్డూలు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉందని వివరించారు.

