Tuesday, April 14, 2026

RRR ఏలైన్మెంట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

RRR ఏలైన్మెంట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

Share

స్వేచ్ఛ మీడియా,హైదరాబాద్: కేంద్రం చేపట్టే ప్రాంతీయ వలయ రహదారి (RRR) ఉత్తరభాగం పనులకు సమాంతరంగా దక్షిణభాగం పనులను చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉత్తరభాగంలో నాలుగు లైన్ల రహదారికి గతంలో టెండర్లు పిలవగా రాష్ట్ర సర్కారు ఆరు లైన్లకు విస్తరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో మరోసారి ట్రాఫిక్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదిక, కేంద్ర మంత్రిమండలి ఆమోదం తర్వాత ఉత్తర భాగం టెండర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ లోపు దక్షిణభాగానికి సవివర ప్రాజెక్టు నివేదిక (DPR)ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కన్సల్టెన్సీ సంస్థను కూడా నియమించింది. దక్షిణభాగం ఎలైన్మెంట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. మూడు ప్రతిపాదనలను పరిశీలించాక.. 201 కిలోమీటర్ల మేర ఈ భాగాన్ని నిర్మించాలని నిర్ణయించింది. పూర్తిస్థాయి డీపీఆర్ వచ్చిన తర్వాత కేంద్రానికి సమర్పించి పనులు చేపట్టాలని కోరనుంది. అందుకు కేంద్రం అంగీకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడానికి సిద్ధమవుతోంది. ఉత్తరభాగం 161.51 కి.మీ., దక్షిణ భాగం 201 కి.మీ. కలిపి RRR మొత్తం 362.51 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఆరు వరుసలుగా నిర్మించే దక్షిణభాగంపై అధికారులు మంత్రిమండలికి సమర్పించిన నివేదికలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

మంత్రిమండలి ఆమోదిత ఎలైన్మెంట్ ప్రతిపాదనలు:

  • యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు మొత్తం 201 కి.మీ. రహదారిని ‘గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు.
  • యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి,
    నాగర్ కర్నూల్ జిల్లాల మీదుగా నిర్మాణం జరగనుంది.
    సంస్థాన్ నారాయణపూర్, మర్రిగూడెం, కేశంపేట, బాలానగర్, షాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల మీదుగా ఈ రహదారి వెళ్లనుంది.
  • సంస్థాన్ నారాయణపూర్, మర్రిగూడెం, కేశంపేట, బాలానగర్, షాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల మీదుగా ఈ రహదారి వెళ్లనుంది.
  • ఎన్ హెచ్-65, ఎన్ హెచ్-44, ఎన్హెచ్-163, ఎస్ హెచ్-19, ఎన్ హెచ్-76లను కలుపుతుంది. • ఈ మార్గంలో ఎక్కడా గుట్టలు, కొండలను తొలవాల్సిన అవసరం లేదు.
  • గంటకు 120కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణించేలా రహదారిని అభివృద్ధి చేయనున్నారు.
  • మొత్తం 55 నివాస ప్రాంతాలను ప్రభావితం చేసే ఈ రహదారికి 2,010 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది.
  • దీని పరిధిలో రెండు రైల్వే క్రాసింగ్ ప్రాంతాలను గుర్తించారు. 22 ప్రాంతాల్లో విద్యుత్ హెచీ లైన్లు ఉన్నాయి.
    ఇండస్ట్రియల్ పార్కులు, సెజ్లకు సమీపం నుంచి వెళ్లేలా ఎలైన్మెంట్ ఏర్పాటు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఆదిభట్ల ఏరో సిటీ ప్రాంతాలను కవర్ చేసేలా ప్రణాళిక.
    భారత నౌకాదళ రాడార్ స్టేషన్, కొంగరకలాన్ ఎకో టూరిజం, ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానత ఉండేలా నిర్మాణం.
  • ORR కి 40 కి.మీ. పరిధిలో RRR రానుంది. హైదరాబాద్ మెట్రో పాలిటన్ ప్రాంతం (హెచ్ఎంఆర్) పరిధిలోకి వచ్చే విధంగా ఎలైన్మెంట్.
  • ప్రాంతీయ రింగ్ రైల్ను ప్రతిపాదిస్తే పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే రవాణా వలయంగా రూపుదిద్దుకోనుంది.

Read more

Local News