Saturday, April 18, 2026

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ ఈటల..

Share

భారత జాతి ఆత్మగౌరవాన్ని,ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా పెంచేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తుంటే భారతజాతి ఆత్మగౌరవాన్ని కించపరిచేందుకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ అంటున్నారు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్.. అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిచిన ఈటల పది సంవత్సరాల మోడీ నాయకత్వంలో భారతదేశం థర్డ్ ఓల్డ్ కంట్రీ కాదని ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ రోజు ఏ దేశంలో మనపౌరులున్నా గల్లా ఎగరేసి నేను భారతీయుడిని అని చెప్పే స్థాయికి మన దేశం ఎదిగిందని కానీ రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి భారతజాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నారని అన్నారు. ఇది దేశంపట్ల ఆయనకున్న వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

Read more

Local News