నల్లగొండలో మీడియా సమావేశంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
గత నెల రోజులుగా గ్రామాలలో, బస్తీలలో ఎక్కడికి వెళ్లినా ఒకటే సమస్య..ఏ దావఖానకు వెళ్లిన మందులు స్టాక్ లేదు అంటున్నారు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్స్ వాళ్ళు కిట్స్ లేవు అంటున్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రావడంలేదని చెప్తున్నారు.
గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు గోడల నిండా ఫంగస్ వచ్చి వైరల్ జ్వరాలు, దాని ద్వారా కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇలాంటి రోగాలకు ఆరోగ్యశ్రీ పనిచేయడం లేదు, ఆయుష్మాన్ భారత్ వర్తించినప్పటికీ మా దగ్గరే గొప్ప స్కీం ఉంది వాళ్ల స్కీం మాకెందుకు అని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.
ఒక్కరికి జ్వరం వస్తే అది గ్రామం మొత్తం వ్యాపిస్తుంది కాబట్టి గ్రామం గ్రామమే దవాఖానాకు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం దీని మీద ఎక్కడా కూడా దృష్టి పెట్టడం లేదు, పేపర్ లో రాయించుకోవడం, సమస్య పరిష్కరిస్తామని చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదు.
మేము ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ ఎక్కడ పోయినా వరద సమస్య కన్నా ఈ సమస్యలు ఎక్కువ చెబుతున్నారు. మీనమేషలు లెక్కపెట్టకుండా 24/7, 365 డేస్ పనిచేస్తే తప్ప హెల్త్ డిపార్ట్మెంట్ నడవదు. ముఖ్యమంత్రి గారు ఏ సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉంటా అని చెప్పారు… ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండరు, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం లేదు.

ల్యాబ్ టెక్నీషియన్లు, శానిటైజేషన్ వర్కర్స్ మీదనే దవాఖానాలు ఎక్కువ నడుస్తాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే వారికి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.
కోవిడ్ వచ్చినప్పుడు కొత్త దవఖానాలు, హాస్పిటల్స్ ఎక్స్పెన్షన్ చేశాం.. పదిమంది ఉన్న దగ్గర 20 మందిని టెంపరరీ బేసిస్సులో తీసుకొని పనిచేయించాం. కోవిడ్ తర్వాత వారందరూ ఖాళీగా ఉంటున్నారు. పాత వాళ్లకు జీతాలు సకాలంలో ఇస్తూ, ఎక్కడెక్కడ దవాఖానల్లో ఏ రకమైన స్టాఫ్ అవసరం ఉందో యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ చేసుకొని పేదలకు వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నాను.
డయాగ్నస్టిక్ సెంటర్స్ లో కిట్స్, పరికరాలు, కెమికల్స్ లేవు. వాటి వల్ల డిటెక్షన్ లేట్ అవ్వడం వల్ల రోగాలు ఎక్కువ వ్యాప్తి చెందుతున్నాయి, మనుషులు చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి త్వరగా పరీక్షలు చేయటం కోసం వాటికి అవసరమైన పరికరాలను అందించాలని డిమాండ్ చేస్తున్నాను.
మెడికల్ కాలేజీలలో, వాటికి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ లో కూడా డాక్టర్స్ లేరు, టీచింగ్ స్టాఫ్ లేరు. టీచింగ్ హాస్పిటల్స్ ను పటిష్టం చేస్తే కొన్ని వేల బెడ్లు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ టీచింగ్ హాస్పిటల్స్ లో కనీస స్టాఫ్ ను ఇచ్చి హాస్పిటల్స్ అన్నీ కూడా సక్రమంగా నడిచే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
గ్రామాలలో ఉన్న హాస్పిటల్స్ లో బెడ్లు పెంచారు కానీ వాటికి అవసరమైన స్టాఫ్ ను పెంచలేదు. 50 బెడ్లకు ఎంతమంది స్టాఫ్ ఉన్నారో 100 బెడ్లు చేసిన తర్వాత కూడా అంతే స్టాఫ్ ఉంది.
టెంపరరీ బేసిస్ లో రిక్రూట్మెంట్ చేసుకొని ఆ బెడ్లన్నీ అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
ప్రభుత్వం అన్నిట్లో రాజకీయాలు మాట్లాడుతున్నరు తప్ప, ప్రజల సమస్యలు, ఆరోగ్యం పట్ల పట్టించుకునే దాఖలాలు లేవు, ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను లేకపోతే అనేక రకాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.
Q&A:
రాష్ట్రలో కొత్త అధ్యక్షుడు ఎప్పుడు నియమిస్తారు..?
సభ్యత్వాలు, మండల కమిటీలు, డివిజన్ కమిటీలు, జిల్లా కమిటీలు తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు. అదంతా ఢిల్లీ పెద్దలు చూసుకుంటారు. పేపర్లలో, టీవీలలో ఏవేవో చెప్తుంటారు… పొలిటికల్ పార్టీల మీద చర్చలు జరగటం సహజం.
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సహాయం ఎలా ఉంది..?
ఒక ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొంత టైం ఇవ్వాలి అని ఇచ్చాం. కానీ 9 నెలలు గడిచినప్పటికీ వాళ్ళు ఇచ్చిన హామీలలో ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీ సక్రమంగా నిర్వహించలేకపోయారు.
Q. సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం లేదు అంటున్నారు..?
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా అమలు అయ్యే బడ్జెట్ పెడుతుంది తప్ప ఒట్టిగా లెక్కల గారడీలు చేయదు. రాష్ట్రాలు కేంద్ర ఇచ్చిన నిధులు ఖర్చు చేసినట్లు యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి.. వీళ్లు ఆ డబ్బును డైవర్ట్ చేసుకొని వాడుకొని UC ఇచ్చే పరిస్థితి లేదు. UC ఇవ్వకపోతే మళ్లీ పైసలు వచ్చే ప్రసక్తి లేదు. రాష్ట్రం దగ్గర NDRF కింద 1365 కోట్లు ఉన్నట్లు లెక్క ఉంది, కానీ ఐదు పైసలు కూడా లేవు. ఇక్కడ ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టామో కేంద్ర ప్రభుత్వానికి UC ఇవ్వలేకపోయింది.
అందుకే కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుంది.

