పచ్చని పందిట్లో రక్తం చిందింది.. అప్పటివరకూ పెళ్ళిలో సందడిగా గడిపిన బంధువులు ఒకరిమీద ఒకరు విరుచుకుపడ్డారు.

నిజామాబాద్ నవీపేట్ లో జరిగిన ఓ వివాహంలో వరుడి తరపు బంధువులు తమకు తక్కువ మటన్ ముక్కలు వడ్డించారంటూ గొడవకు దిగారు. వధూవరుల బంధువులిద్దరి మధ్య వివాదం మాటలతో మొదలై చేతలదాకా వెళ్ళింది. ఏకంగా వంటబల్లలు, పాత్రలు, కర్రలు, రాళ్ళు ఇలా చేతికి ఏది దొరికితే దాంతో కొట్టుకున్నారు.

ఇలా రెండు వర్గాల పరస్పర దాడుల్లో 8మంది తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి ప్రవేశించడంతో పరిస్థితి సద్ధుమణిగింది. అనంతరం ఇరువర్గాలకు చెందిన 19మందిపై కేసులు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై తెలిపారు.

