Tuesday, April 14, 2026

10లక్షల ఉద్యోగావకాశాలు..

Share

మోదీ సర్కార్ త్వరలో నిరుద్యోగుల కల నెరవేర్చబోతోంది. ఏకంగా 10లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దేశవ్యాప్తంగా 12కొత్త ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో సమావేశమయిన కేంద్రమంత్రివర్గం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కు ఆమోదం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో కలిపి దేశం మొత్తంమీద 10రాష్ట్రాల్లో 12పారిశ్రామిక స్మార్ట్ సిటీలను నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వనీ వైష్టవ్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 28 వేలకోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వివరించారు. ఈ స్మార్ట్ సిటీల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి పరోక్షంగా 30 లక్షల మందికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి అన్నారు.

Read more

Local News