మరో రెండు మూడు నెలల్లో జార్ఖండ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయని, మార్పు కనిపిస్తుందని డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ గుప్త మాట్లాడుతూ జార్ఖండ్ పోలీసులు ఈ సంవత్సరం బాగా సన్నద్ధంగా ఉన్నారని.. ఇప్పటికే జార్ఖండ్ లో నక్సలిజం సమస్యను 95శాతం పూర్తిచేశామని అన్నారు. మిగిలిన ఐదు శాతం కొన్ని అటవీ ప్రాంతాలకే పరిమితమైందని దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో తప్పించుకోగలుగుతున్నారని వ్యక్తిగతంగా వారిని వెంబడిస్తున్నామన్నారు.

ఆగస్టు 15న ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆపరేషన్లు నిర్వహాస్తున్నామన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్మూ-శ్రీనగర్ హైవేపై వాహనాల తనిఖీతో సహా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వేడుకలు సజావుగా నిర్వహించేందుకు భద్రతా సిబ్బంది ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సిఆర్‌పిఎఫ్, సిఐఎస్‌ఎఫ్, మరియు ఇతర భద్రతా దళాలు అలర్ట్ గా ఉన్నాయని డీఎస్పీ కుమార్ ఏన్ఐకి తెలిపారు.

