
పుస్తకాలు లేకుండా స్కూల్ కి వెళ్తే..?
పుస్తకాలు లేకుండా స్కూల్ కి వెళ్తే.. ఆ ఊహే ఎంత బావుందో కదా.. కానీ ఇది నిజం కాబోతోంది.. బ్యాగ్ లెస్ డేస్ అంటూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈ కాన్సెప్ట్ ను ప్రతిపాదించింది. 6 నుంచి 8 తరగతుల విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించడమే బ్యాగ్ లెస్ డేస్ యోక్క ప్రధాన లక్ష్యం. సంవత్సరంలో కనీసం పది రోజులు అంటే దాదాపు 60గంటలు పుస్తకాలు లేని తరగతుల కోసం కేటాయించాలి. ఈ రోజులను విద్యార్ధుల్లో అభ్యాసం మరియు వృత్తిపరమైన అనుభవాలు పెంపొందిచడానికి వినియోగిస్తారు. వివిధ థీమ్స్ లో భాగంగా సైన్స్, ఎన్విరాన్‌మెంట్, టెక్నాలజీ, పబ్లిక్ ఆఫీస్ బిజినెస్ మానేజ్మెంట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ వంటి వివిధ అంశాల్లో అవగాహన కల్పిస్తారు. స్థానిక మొక్కలు నేల మరియు నీటిని పరీక్షించడం , జంతువులను అన్వేషించడం, డ్రోన్‌లు మరియు కృత్రిమ మేధస్సుపై వర్క్‌షాప్‌లకు హాజరు కావడం వంటివి ఉంటాయి పబ్లిక్ సర్వీసెస్ మరియు పరిశ్రమ కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు పంచాయతీ కార్యాలయాలు, బ్యాంకులు మరియు డెయిరీ ఫామ్‌లను సందర్శిస్తారు.ఇక కళ, సంస్కృతి మరియు చరితలో భాగంగా తోలుబొమ్మలాట, నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, చారిత్రక ప్రదేశాలు మరియు జాతీయ కార్యక్రమాల సందర్శనలు ఉంటాయి. ఉపాధ్యాయులు ఈ కార్యకలాపాలను ప్లాన్ చేస్తారని మరియు ఆచరణాత్మక అనుభవాన్ని అందించడానికి వడ్రంగులు, కుమ్మరులు వంటి స్థానిక నిపుణులతో కలిసి పని చేయిస్తారు. ఆచరణాత్మక నైపుణ్యాలను గమనించి విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ చొరవ ముఖ్య ఉద్దేశం. సాంప్రదాయ తరగతి గది పాఠాలకు మించి నేర్చుకోవడాన్ని మరింత ఆసక్తికరంగా వైవిధ్యంగా మార్చడం కూడా దీని లక్ష్యం. ఒక PSS సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రయల్ ప్రాజెక్ట్ బ్యాగ్‌లెస్ రోజులు విద్యార్థులను ఉద్యోగ నైపుణ్యాలను నేర్చుకోవడంలో మరింత ఆసక్తిని కలిగిస్తాయని చూపించింది. ఇది విస్తృత విద్యకు మద్దతు ఇస్తుంది.
Share

Read more

