
దారిమళ్ళిన పులస
ఏటేటా గోదావరిలో సందడిచేసే పులసలకోసం ఎదురుచూసే ఆహార ప్రియులకు ఈ సారి నిరాశేఎదురవుతోంది. సంతానోత్పత్తి కోసం సముద్రానికి ఎదురీదే క్రమంలో గోదావరిలో కనిపించే ఈ పులసలు ఈసారి మాత్రం తమ రూటు మార్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలనుంచి వీటి రాక తగ్గుముఖం పట్టిందంటున్నా ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండునెలల్లో ఇప్పటివరకూ కేవలం ఒక్క పులసే దొరికిందంటే ఇవి గోదావరి వైపు రాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు నుంచి సముద్రంలోకి ఈదుతున్నాయని మత్య్స శాస్త్రవేత్తలు అంటున్నారు. సముద్ర జలాల నుంచి కొన్నివేల నాటికల్ మైళ్ళు ప్రయాణించి వరదల్లో వచ్చే బురదమట్టినే ఆహారంగా తీసుకుంటూ సంతానోత్పత్తికోసం గుంపులు గుంపులుగా వలసవస్తాయి. ఈ క్రమంలో మంచి పోషక విలువలతో పులస రుచికరంగా తయారవుతుంది. అందుకే వేలు ఖర్చుపెట్టయినా సరే దీన్ని రుచిచూడాలని తహతహలాడతారు. అయితే గోదావరిలో తీరప్రాంతాల ద్వారా విడుదల అవుతున్న పారిశ్రామిక వ్యర్ధాలు, ఇతర కాలుష్య పదార్ధాలు నేరుగా సముద్రంలోకి చేరుతుండడంతో ఈ దారిలో సంతానోత్పత్తికి సానుకూల పరిస్థితులు తగ్గాయని.. అందుకే ఇవి దారిమళ్లి హుగ్లీనది వైపు పయనమవుతున్నాయని పరిశోధనల్లో వెల్లడించారు. దీంతో పులస కోసం ఆతృతగా ఎదురుచూసే వారి ఆశలు అడియాశలైనట్టే మరి..
Share

Read more

