
అద్భుత చిత్రాన్ని పంచుకున్న నాసా..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఇటీవల తీసిన భూమి టెర్మినేటర్ యొక్క అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. భూమికి దాదాపు 267 మైళ్ల దూరంలో ఉన్న ఈ చిత్రం రాత్రి మరియు పగలు మధ్య అందమైన రేఖను చూపుతోంది. సూర్యుని కాంతి సన్నని అంచువలే పగటి నుంచి రాత్రిని వేరుచేసే రేఖను భూమి యొక్క టెర్మినేటర్ అంటారు. ప్రతిరోజూ రెండుసార్లు భూమి మీదుగా టెర్మినేటర్ కదులుతుంది. చాలా ప్రదేశాలలో సూర్యుడు ఉదయించినప్పుడు మరియు అస్తమిస్తున్నప్పుడు ఇది కనిపిస్తుంది. ఇది భూమధ్యరేఖ వద్ద గంటకు 1,670 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. భూమి స్థితిగతుల వల్ల రేఖ స్థానం మారడంవల్ల సూర్యకాంతి ఎలా వ్యాపిస్తుందన్న దానిపై ప్రభావం చూపుతుంది.
Share

Read more

