ప్రజలందరి ఎదుగుదలలోనే రాష్ట్ర, దేశ భవిష్యత్తు ఉంది.
వంజర కులానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
25 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు ఎదిగిన బిడ్డను నేను.
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తొలి ఆర్థిక మంత్రిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా నేను మీకు తెలుసు.

ఆర్థిక మంత్రి అయిన వెంటనే అన్ని కుల సంఘాలకు భవనాలు ఉండాలి హాస్టల్స్ ఉండాలి అని ప్రతిపాదించిన వాడిని.
78 కులాలకు అక్కడ ఇక్కడ కాదు హైటెక్ సిటీ దగ్గర స్థలాలు ఉండాలని కోరుకున్న వాడిని.
ఆ కుల సంఘ భవనాలన్నీ మన ఆత్మ గౌరవ కేంద్రాలుగా వెలసిల్లాలని కోరుకుంటున్నాను.
కుల సంఘాల భవనాలను పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
ప్రజా నాయకునికి సొంత విశ్వాసాలు ఉండవు..
ప్రజల విశ్వాసాలను కాపాడటమే వారి కర్తవ్యం.
పొలిటికల్ లీడర్ పొత్తుల సద్దిగా ఉండాలి.
అంబేద్కర్ గారు సూచించిన విధంగా డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది నా లక్ష్యం.

పార్లమెంటు ఎన్నికలలో నాకు ఓటు వేసి గెలిపించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని సమున్నతంగా నిలబెడతా.
నీకు కీర్తి తెచ్చి పెట్టేలాగా పనిచేస్తాను.
నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీలో లేదు.
ప్రతి సమస్య పరిష్కారానికి ఒక మార్గం ఉంటుంది.
సమాజ హితంలో నా వంతు కర్తవ్యాన్ని వహిస్తాను.


