ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, ములుగు జిల్లా కేంద్రంలో హర్‌ఘర్‌తిరంగా అభియాన్ లో భాగంగా తిరంగ యాత్రలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. వందల సంవత్సరాలుగా లక్షలాదిమంది భారతమాత ముద్దుబిడ్డలు, నా దేశానికి స్వేచ్ఛ కావాలని, స్వతంత్రం రావాలని, పరాయి పాలకుల పీడ పోవాలని ఎంతోమంది అమరులయ్యారు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనందరం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రం ఆనాటి అమరుల త్యాగాల ప్రతిఫలమని మనం మర్చిపోతున్నాం. ఈ దేశం ప్రపంచంలోనే ప్రజాస్వామిక విలువలతో, స్ఫూర్తితో ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్న దేశం భారతదేశం. ఇంత గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన స్వతంత్ర భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పే గొప్ప సన్నివేశమే “హర్ ఘర్ తిరంగా” కాబట్టి దీన్ని కాపాడుకోవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. కొన్ని వందల సంవత్సరాలు మొగలాయిల పరిపాలన కావచ్చు, ఆంగ్లేయుల పరిపాలన కావచ్చు ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు అమరులయ్యారు.
“ఉరి కంభం మీద నుంచి ఊహగానం చేసిన నా దేశం స్వతంత్రం సిద్ధిస్తే మరో జగత్ ను వీక్షిస్తా” అని చెప్పిన మహనీయుడు భగత్ సింగ్ గారు.. అలాంటి అనేకమంది స్వతంత్ర సమరయోధుల త్యాగం ఫలితంగా వచ్చిన స్వతంత్రన్ని రాబోయే కాలానికి ఈ త్యాగాల గురించి తెలియజెప్పేటువంటి సన్నివేశమే ఈ కార్యక్రమం. అన్ని గ్రామాలలో, అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

