స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్.

పీవీ ఘాట్ లో పీవీ నరసింహరావు గారికి నివాళులు అర్పించిన ఎంపీ ఈటల రాజేందర్.
పీవీ గారు మా హుజూరాబాద్ వాసి.
అంచలంచలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యారు.
ఈరోజు ఆయన 104 వ జయంతి ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాము.
వారి పార్లమెంట్ పరిధిలో మా ఊరు ఉంది.
అప్పట్లో వారి గురించి కథలు కథలుగా చెప్పుకునే వారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దళంలో పనిచేసిన వారు.
ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వేలు లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఆణిముత్యాలలాంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారుచేశారు.
కేంద్రంలో HRD మంత్రిగా ఉన్నప్పుడు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసింది కూడా పీవీ గారే.
విదేశీ విధానాన్ని ప్రపంచ చిత్రపటం మీద మహోన్నతంగా నిలబెట్టిన వ్యక్తి .
ఆయన దేశ ప్రధాని అయిననాడు అనేక ఆర్ధిక ఇబ్బందులతో దేశం ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్న సమయంలో లిబరైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకువచ్చారు.
భారత ఆర్ధిక వ్యవస్థ దారిలో పెట్టారు.
మన దేశ ఆర్ధిక పరిస్థితి ఈరోజు ఈ స్థాయికి రావడానికి బాటలు వేశారు.
ఆయన జీవితం రాజకీయవ్యవస్థకు, నాయకులకు గొప్ప సందేశం.
పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము.
- ఈటల రాజేందర్,
- ఎంపీ, మల్కాజిగిరి.

