Tuesday, April 14, 2026

నల్లచెరువు భూముల విషయం లో ప్రభుత్వం ఏకపక్ష ధోరణి కండించిన ఈటల.

నల్లచెరువు భూముల విషయం లో ప్రభుత్వం ఏకపక్ష ధోరణి కండించిన ఈటల.

Share

నల్లచెరువు పక్కన ఉన్న ప్రైవేట్ భూములను ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకుంటుందని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేపడుతున్నారని స్థానికుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు బాధితుల దగ్గరికి వెళ్లి పరిశీలన చేసిన ఎంపీ ఈటల రాజేందర్.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా చట్టం తెచ్చి పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.

ప్రజల ఆగ్రహంతో హైడ్రా తోక ముడిచింది.

పేద ప్రజల ఆక్రందనలకు, ఆవేదనకు దుఃఖానికి భయపడ్డ రేవంత్ రెడ్డి దొడ్డి దారిన మరో పిచ్చి పని చేస్తున్నాడు.

ఒకనాడు హైడ్రా పేరుతో నిర్ధాక్షణ్యంగా షట్టర్లు కూల్చివేస్తే మనోవేదనకు గురై బుచ్చమ్మ చనిపోయింది.

నల్లచెరువు విస్తీర్ణం 20 ఎకరాలుంటుంది. అందులో ప్రభుత్వ పరంగా ఉన్న భూమి ఏడెకరాల 36 కుంటలు మాత్రమే. మిగిలినదంతా రైతుల పట్టా భూములు.

హైదరాబాదులో అర్బనైజేషన్ జరిగిన తర్వాత చెరువుల పారుదల లేదు.. వ్యవసాయ పొలాలకు నీరు బంద్ అయిన తర్వాత FTL అన్ని పోయి… ఈ పట్టా భూములలో మట్టి నింపుకొని షెడ్డులు వేసుకొని వాడుతున్నారు.

నల్ల చెరువులో ఉన్న ప్రైవేట్ రైతుల భూములు నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లు పెట్టి వాటిని బావులు లెక్క తవ్వే ప్రయత్నం చేస్తున్నారు.

పట్టా భూములు ఉన్న రైతులు హైడ్రా అధికారులను, రెవెన్యూ అధికారులను వేడుకున్నారు ఎక్కడ నుంచి సమాధానం రాకపోతే చివరికి న్యాయం జరగాల్సింది కోర్టులలో కాబట్టి హైకోర్టు మెట్లు ఎక్కారు.

మీరు ప్రైవేటు పట్టా భూములలో ఏలాంటి చర్యలు చేపట్టవద్దు. వాళ్లని ఇబ్బంది పెట్టొద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కోర్టు, చట్టమంటే గౌరవం లేదు.

హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా నిన్న ఇక్కడ అధికారులు మిషన్లు పెట్టి ప్రైవేట్ పట్టా భూములలో మట్టిని తీస్తా ఉంటే ఎంత మొత్తుకున్నా ఆపలేదు.

మీరు ఒకవేళ నల్లచెరువుని బ్యూటిఫికేషన్ చేయాలి అనుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ పట్టా భూములకు ఎంత విలువైతే ఉంటుందో అంత భూమి మాకు ఇవ్వండి, లేదా కంపెన్సేషన్ ఇచ్చి తీసుకోండి.

మేము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, చెరువుల బ్యూటిఫికేషన్ కు వ్యతిరేకం కాదు కానీ ప్రైవేట్ వ్యక్తుల ఇల్లు గుంజుకుంటా అంటే ప్రైవేట్ పట్టా భూముల గుంజుకుంటా అంటే నీ అబ్బ జాగిరి కాదు అని హెచ్చరిస్తున్నాను.

Read more

Local News