Tuesday, April 14, 2026

ఖమ్మం సంవిధాన హత్య దివస్ లో ఎంపీ ఈటల రాజేందర్.

ఖమ్మం సంవిధాన హత్య దివస్ లో ఎంపీ ఈటల రాజేందర్.

Share

సంవిధాన హత్య దివస్ లో మాట్లాడిన ఎంపీ ఈటల రాజేందర్ :

50 సంవత్సరాల చీకటి అధ్యాయంను ఈ తరానికి తెలియజేయాలని ఈ మీటింగ్.

పార్లమెంట్ లో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని కాంగ్రెస్ నేతలు ప్రమాణస్వీకారం చేశారు. కానీ దొంగే దొంగ అన్నట్టు ఉంది ఆ పార్టీ వ్యవహారం.. ప్రజలు చరిత్ర మర్చిపోతారని వారు అనుకుంటున్నారు. కానీ గుర్తుచేయడానికి మేమున్నాం.

ఆనాడు ఏ గ్రామంలో చూసినా ఇనుప బూట్ల చప్పుళ్లే.
లక్షల మందిని జైల్లో పెట్టారు.. వందల మందిని చంపేశారు, మాయం చేశారు ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ.
పత్రిక స్వేచ్ఛతో పాటు అన్ని స్వేచ్ఛలు హరించివేయబడ్డాయి.

రాజ్యాంగం వల్లనే ప్రజలు ఓట్లు వేస్తేనే ఆమె ప్రధాని అయ్యిందని మర్చిపోయి, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టింది.
రాజ్యాంగబద్ధంగా పనిచేస్తానని ప్రమాణం చేసిన ఇందిర రాజ్యంగాన్ని అపహాస్యం చేసింది.

ఆ రాజ్యాంగం వల్లనే ఒక చాయ్ అమ్ముకునే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు.
కోవింద్ గారు, ముర్ము గారు దేశ రాష్ట్రపతులు అయ్యారు.

నరేంద్ర మోదీ గారు రాజ్యాంగ సవరణ దేశం కోసం చేశారు:
దేశంలో ఒకే చట్టం, ఒకే జెండా, ఒకే ప్రధాని కోసం రాజ్యాంగ సవరణ చేసి 370 ఆర్టికల్ తీసి గంగలో కలిపారు.
మహిళలకు 33 శాంతం రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేశారు.
కానీ ఇందిరా గాంధీ చేసింది మన హక్కులు హరించివేయడానికి, జైల్లో పెట్టడానికి.

ఎమర్జెన్సీ తరువాత ఎన్నికలు జరిగితే కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇందిరాగాంధీ పార్టీని బొందపెట్టాలని ఓట్లు వేశారు.

నేను నా భార్య ఫోన్లు టాప్ చేసి మేము ఏం మాట్లాడుకున్నారో విన్నారు.
స్వేచ్ఛ లేకుండా చేశారు.
రాజ్యాంగ హక్కును కాలరాసిన నీకు శిక్ష తప్పదు.
నీవు నీ కుటుంబం రాష్ట్రాన్ని కబ్జా పెట్టారని ప్రజలు ఓడగొట్టారు.
చరిత్ర నిర్మాతలు పార్టీలు, నాయకులు కారు సామాన్య ప్రజలు.
వారి హక్కులు హరిస్తే కొడక ఖబర్దార్ అని హెచ్చరిస్తారు.
సందర్భం వచ్చినప్పుడు తొక్కి పడేస్తారు.
గుద్దుడు గుద్దితే దిమ్మ తిరుగుతుంది, నీ అబ్బ జాగీరు కాదు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే ఇంటికి పోవడమే..
మళ్లీ ఈ పార్టీ అధికారంలోకి రాదు అని కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు.

రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించడం, ఎమర్జెన్సీ నల్లరోజులను ప్రజలకు తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం.

బీవీఆర్ ఫంక్షన్ హాల్, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు కోటేశ్వర రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, రమేష్, పుల్లారావు, వినోద్ రావు, వాసుదేవరావు, dr పాపారావు, రవి కుమార్, శ్యామ్ రాథోడ్, సంతోష్ రెడ్డి, పుణ్యవతి, వెంకటేశ్వర్లు, విజయ రెడ్డి, వీరభద్రం, రవి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Read more

Local News