ఉత్కంఠ పోరులో విజయం సాధించిన నైట్ రైడర్స్.
ఆఖరి బంతి వరకు పోరాడిన రాజస్థాన్ రాయల్స్ కు నిరాశే ఎదురైంది.
పరాగ్ వీరోచిత పోరాటం వృధా.
2025 IPL :ఐపీఎల్ టోర్నీలో రోజురోజుకీ ఆసక్తి పెంచుతున్న ఉత్కంఠ పోరాటాలు, ఆఖరి బంతి వరకు విజయం కోసం రెండు జట్ల సమరం చివరి కు పరుగు తేడాతో నైట్ రైడర్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. 6 బంతుల్లో 22 పరుగులు చేస్తేనే రాజస్థాన్ రాయల్స్ కు విజయం చేకూరే పరిస్థితి ఇది రాజస్థాన్ రాయల్స్ కి కష్టతరమైంది అదే సమయంలో కోల్కత్తాకు కలిసొచ్చే అంశం. వైభవ్ అరోరా వేసిన ఈ చివరి ఓవర్ లో మొదటి అయిదు బంతులకు 2,1,6,4,6 పరుగులతో 19 పరుగులు వచ్చేసాయి ఇక ఒక్క బంతికి మూడు పరుగులు మాత్రమే అవసరమము , ఇది ఇరు జట్ల ఆటగాళ్లను తీవ్ర ఒత్తిడిలో పడేసింది .అప్పటిదాకా సిక్స్ లు, ఫోర్లు బాదిన శుభమ్ దూబే భారీ షాట్ ఆడలేకపోయాడు కనీసం టై కోసం రెండు పరుగులు తీసే ప్రయత్నం చేసినా కూడా ఆర్చర్ రనౌట్ తో వృధా ప్రయాస అయింది చివరికి ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో నైట్ రైడర్స్ ఊపిరి పీల్చుకుంది.
ఇకపై ప్రతి మ్యాచ్ నెగ్గితేనే ముందుకు వెళ్లే పరిస్థితిలో ఉన్న డిపెండింగ్ ఛాంపియన్ కోల్కత్తా నైట్రేడర్స్ ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది. నిన్న ఉత్కంఠ రేపిన ఐపీఎల్ మ్యాచ్ లో రహానే సాధ్యంలో కొల్కత్తా ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్ ఫై నెగ్గింది .
మొదట బ్యాటింగ్ కు దిగిన కొలకత్తా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆండ్రీ రస్సెల్ ( 25 బంతుల్లో 57 నాట్ అవుట్ 4 ఫోర్లు 6 సిక్స్ లు) మెరుపు అర్థ శతకం సాధించాడు. అతనికి తోడుగా అంగీకృష్ రఘువంశీ( 31బంతుల్లో 44 ;5 ఫోర్లు ), గుర్బాజ్(25 బంతుల్లో35;4 ఫోరులు,1 సిక్స్ ), రహానే(24బంతుల్లో30 ;1ఫోర్ ,2సిక్సలు ) దాటిగా ఆడారు.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన రాజస్థాన్ 20 ఓవర్ లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. టాపార్డర్ మొత్తం విఫలమైన సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ 45 బంతుల్లో 95 (6 ఫోర్లు , 8 సిక్స్ లు) వీరోచిత పోరాటం చేశాడు అతనికి సహకరిస్తూ హిట్ మైర్ 23 బంతుల్లో 29 పరుగులు చేశాడు కానీ కీలక దశలో షరా మామూలుగా చేతులెత్తేశాడు. ఆఖరిలో శుభమ్ దూబే( 14 బంతుల్లో 25 నాట్ అవుట్;1ఫోర్,2సిక్సలు ) ఆఖరి బంతి దాక జట్టును గెలిపించేందుకు నిలిచినా ఆర్చర్ రన్ అవుట్ తో ఆశలు కుప్పకూలాయి.
కోల్కత్తా బౌలర్లు :మొయిన్ అలీ ,హర్షిత్ రానా ,వరుణ్ చక్రవర్తి .తల 2 వికెట్లు పడగొట్టారు
దీంతో కొల్కత్తా 11 మ్యాచ్లకు గాను ఐదు గెలిచి 5 ఓడి ఒకటి ఫలితం తేలాక పోవటం వల్ల 11 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది.
POINTS TABLE:


