78వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పాత రికార్డు బద్దలు కొట్టారు. వరుసగా 11వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి అంతకు ముందున్న మన్మోహన్ సింగ్ రికార్డును బ్రేక్ చేశారు.పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 మధ్య 10 సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు.

అంతకుముందు 1947 నుంచి 1964 వరకూ 17సార్లు జాతీయజెండాను ఎగురవేసిన రికార్డు మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు సొంతం కాగా 16 సార్లు జెండా ఎగురవేసి రెండవ రికార్డు ఇందిరాగాంధీ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అత్యధికంగా త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన ప్రధానిగా మూడోస్థానాన్ని మోదీ దక్కించుకున్నారు.

