Monday, July 20, 2026

కుంభమేళాలో కుటుంబసమేతంగా పుణ్యస్నానం చేసిన ఎపీ డిప్యూటీ సీఎం..

Share

మహాకుంభమేళలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరానందన్ తో పాటు త్రివిక్రమ్ పవిత్రస్నానమాచరించారు. త్రివేణీ సంగమం వద్ద హారతి సమర్పించి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. కుంభమేళాకు వచ్చే ప్రతీ ఒక్కరూ క్షేమంగా ఇళ్ళకు తిరిగివెళ్ళాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

Read more

Local News