Tuesday, April 14, 2026

భారత్ , పాక్ మధ్య నేడు ఐక్యరాజ్యసమితిలో చర్చలు.

భారత్ , పాక్ మధ్య నేడు ఐక్యరాజ్యసమితిలో చర్చలు.

Share

ఐక్యరాజ్య సమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది భద్రతామండలిలో భారత్ ,పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ఫై చర్చించబోతున్నారు . అంతర్జాతీయ సమాజం ముందు ఇరుదేశాలు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహాల్గాం పట్టణంలో బైసరంలో 26 మంది పర్యాటకులని ఉగ్రవాదులు కాల్చి చంపారు ఇందులో పాక్ హస్తం ఉన్నదని నిర్ధారించుకున్న భారత్ అన్ని రకాల ఆంక్షలతో పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది .

ఈ క్రమంలో ఈ పరిణామాలపై ఆదివారం పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు స్పందించారు భారత్ అతిగా వ్యవహరిస్తూ తమను ఇబ్బంది పెడుతోందని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంది అన్నారు మరీ ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ అక్రమంగా వ్యవహరిస్తుందని ఈ విషయాలన్నీ భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తుతామని ఆయన వివరణ ఇచ్చారు.


మరీ ముఖ్యంగా భారత్ సింధుజలాలను నిలిపివేయడాన్ని యుద్దంగానే పాక్ భావిస్తుంది.

ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశానికి ముందు మండలి ప్రతినిధులు ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న తాము వ్యతిరేకిస్తామని అదే సమయంలో ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రికత్త పరిస్థితుల పై ఆందోళన చెందుతున్నామని అన్నారు.


ఇదిలా ఉండగా పహాల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నవేళ పాక్ నుంచి వచ్చే అన్ని వస్తువుల దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది ఈ మేరకు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ మే 2న నోటిఫికేషన్ జారీ చేసింది దిగుమతులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది అని తెలిపింది పాకిస్తాన్ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎగుమతి అయ్యే అన్ని వస్తువులపై నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య విధానంలో ఓ నిబంధన చేసినట్లు ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. జాతీయ భద్రత ప్రభుత్వం విధానం ప్రయోజనాల కోసం పాకిస్తాన్ నుంచి లేదా ఆ దేశం మీదుగా వచ్చే అన్ని వస్తువులపై దిగుమతి నిషేధం విధించామని స్పష్టత ఇచ్చారు
ఐక్యరాజ్యసమితిలో జరిగే సమావేశంలో ఈ అంశాలు అన్ని చర్చకు వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ వ్యక్తం చేశారు.

Read more

Local News