Saturday, April 18, 2026

జాతీయ పక్షి సంరక్షణపై దృష్టి

Share

కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ భారతదేశంలో నెమళ్లకు రెండు కొత్త అభయారణ్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వన్యప్రాణులు మరియు జాతీయపక్షి సంరక్షణకు కర్నాటక, కేరళల్లో ఈ అరణ్యాలను ప్రారంభించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిద్వారా మానవభంగం, వేటదాడి లేకుండా పక్షులు జీవిస్తాయని తద్వారా అవి వృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన నెమళ్ళ మరణాలపై స్పందించిన మంత్రి కేవలం హీట్ స్ట్రోక్ వల్ల తప్ప బర్డ్ ఫ్లూ వల్ల కాదని వివరించారు. నెమళ్ళ సంరక్షణలో భాగంగా నెమళ్ల జనాభాను పెంచే లక్ష్యంతో బ్రీడింగ్ మరియు కన్జర్వేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం వంటి అనేక చర్యలను పర్యావరణ శాఖ తీసుకుంటుంది.

ఇప్పటికే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ఆకుపచ్చ నెమలికి ముప్పు పొంచి ఉన్నట్లు తెలియజేసింది. అందుకే నెమలి పరిరక్షణలో భారతీయ నీలం మరియు ఆకుపచ్చ నెమళ్ళు రెండింటినీ రక్షించడమే ముఖ్య ఉద్దేశం అని పేర్కొంది. మరోవైపు స్థానిక సంఘాలు ఈ పరిరక్షణ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నాయి. భారతదేశ జాతీయ పక్షి అయిన నెమళ్ళు జీవవైవిధ్యం మరియు సాంస్కృతిక వారసత్వానికి ముఖ్యమైనవి. వాటి పరిరక్షణతో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంతో పాటు భారతదేశ సహజ వారసత్వాన్ని పెంపొందించుకోవడమే ముఖ్యలక్ష్యం.

Read more

Local News