Wednesday, June 24, 2026

పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాకు ఈటల మద్దతు

Share

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న ధర్నాలో మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సొంత డబ్బులు పెట్టి పిల్లలకు వండి పెడుతుంటే వాటికి చెల్లించాల్సిన డబ్బులు ఐదారు నెలల తర్వాత గ్రాంట్ రూపంలో ఇవ్వడం దారుణమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతినెల సరుకులకు పైసలు ఇవ్వాలన్న డిమాండ్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వంట కార్మికులకు పదివేల రూపాయలు జీతభత్యము చెల్లింస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీని వెంటనే అమలు చేయాలని.. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు గుడ్లు, పాల ధరలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

Read more

Local News