రాజధాని(అమరావతి ) పునర్నిర్మాణ పనులకు నరేంద్ర మోడీ ఈరోజు శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు ఏపీ మరియు తెలంగాణకు రైల్వే బడ్జెట్ 900 కోట్ల లోపే ఉండేదని ప్రధాని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు 9 వేల కోట్ల రైల్వే నిధులు ఒక్క ఆంద్రప్రదేశ్ కె ఇచ్చామని ప్రధాన మోడీ అన్నారు . ఆంధ్రప్రదేశ్లో 70కి పైగా రైల్వేస్టేషన్లో అమృత్ భారత్ కింద అభివృద్ధి చేశామన్నారు రక్షణ రంగం ను కూడా ఎంతో బలదు బలోపేతం చేశామని నరేంద్ర మోడీ వెల్లడించారు.
నాగాయలంకలో టెస్టింగ్ రేంజ్ దుర్గామాత లాగా భారత రక్షణ రంగానికి శక్తి ఇస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కలలుకనే వారి సంఖ్య ఎక్కువగా ఉందని వాటిని నెరవేర్చే వారి సంఖ్య కూడా ఎక్కువ అని మోడీ హర్షం వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సరైన మార్గంలో నడుస్తుంది అన్నారు కానీ మనమందరం కలిసినడవాలి ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అమరావతి అంటే ఒక శక్తి అని ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణద్రప్రదేశ్ గా ఇది మారుస్తుంది అని ప్రధాన నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇంద్రుడి రాజధాని అమరావతి అని మనకు తెలుసు ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఇది అదృష్టం కాదు ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి శుభ సూచకం అని ఇది స్వర్ణాంధ్ర విజయానికి శక్తి ఇస్తుందన్నారు
దుర్గ భవాని కొలువైన ఈ పుణ్యభూమిలో కలవడం నాకు ఆనందంగా ఉందని మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు తాను ఇప్పుడు అమరావతి పుణ్యభూమిపై నిలబడి ఉన్నాను అన్నారు ఒక స్వప్నం త్వరలోనే సహకారం కాబోతుందని తెలిపారు ఇక్కడ ఉన్నవి కాంక్రీట్ నిర్మాణాలు కాదు పునాదులు అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అమరావతి అంటే పురోగతి అన్నారు . అమరావతి అనేది ఇంద్రలోకంలో ఇంద్రలోక రాజధాని అని పేర్కొన్నారు
స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఇది శుభసంకేతమని ప్రధాని మోడీ తెలిపారు అమరావతి నిర్మాణం స్వర్ణాంధ్ర నిర్మాణానికి బీజం వేస్తుందని ,పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్న వాటిని త్వరితగతిలో పూర్తి చేయాలన్న చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు . హరిత శక్తి పరిశ్రమలు, విద్యా వైద్య కేంద్రాలుగా త్వరలోనే అమరావతి గమ్యస్థానంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తాను గుజరాత్ లో సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు పనితనం గురించి తెలుసుకొని హైదరాబాదులో ఐటీ ని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకోవడం కోసం తమ అధికారులను పంపించి అధ్యయనం చేశామని చెప్పారు
పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన అనంతరం సభావేదిక ఫై జూన్ 21న మళ్లీ ఏపీకి వస్తాను అన్న ఆయన ఆరోజు యావత్ ప్రపంచం మన వైపు చూసి మాట్లాడేలా చేయాలన్నారు జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం కి ఇంకా 50 రోజులు ఉందని 50 రోజుల్లో ఏపీలోని ప్రతి ఊరు గ్రామం వీధి తిరిగి ఇంటింటికి యోగాని ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు , సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇది సాధ్యమవుతుందని తన నమ్ముతున్నానని ఈ ఘనత సాధిస్తామని తెలిపారు. విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవానికి తాను తప్పకుండా వస్తాను అని నొక్కి చెప్పారు.
మూడు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తయ్యాక ఏపీజీడీపీ(APGDP ) ఏ స్థాయికి వెళ్తుందో తాను ఊహించగలనని తెలిపారు టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ కి అమరావతి కేరాఫ్ అడ్రస్ గా మారుతుందని తాను ఆశాభావం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తాను కూడా మీ భుజంతోపాటు నా భుజం కూడా కలిపి పని చేస్తానని హామీ ఇచ్చారు “మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి కట్టుబడి ఉన్నది” అని, చివరిగా తెలుగులో ప్రసంగించి తన ప్రసంగాన్ని
వందేమాతరం అంటూ ముగించారు .


