ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై నేడు ఉత్కంఠ వీడనుంది. సీఎంను ఎంపిక చేసేందుకు అప్ ఎమ్మెల్యేల కీలక సమావేశం ఈరోజు ఉదయం 11.30 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో జరగనుంది. గతవారం లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ పై వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించడంతో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేగింది. దీంతో మంత్రులు గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, అతిషి, షౌరభ్ భరద్వాజ్ లు తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ తో భేటీ అనంతరం ఈ రోజు సాయంత్రానికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసేఅవకాశం ఉంది.

