ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత ఆరునెలలుగా ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు తీర్పును ప్రకటించింది. ఇప్పటికే మరో కేసులో కస్టడీలో ఉన్న వ్యక్తిని విచారణ నిమిత్తం అరెస్టు చేయడంలో ఎలాంటి ఆటంకం లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఎక్సైజ్ కుంభకోణం అవినీతిపై సీబీఐ విచారిస్తున్న కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడిగించింది. కేజ్రీవాల్, పాఠక్, వినోద్ చౌహాన్, ఆశిష్ మాథుర్, శరత్‌రెడ్డిలపై దర్యాప్తు సంస్థ కొన్ని వారాల క్రితం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.

