Friday, May 1, 2026

రేపిస్ట్ మద్దతుదారులకు ఎంఎల్ఏ టికెట్ ఇచ్చిన ఆ పార్టీ..

Share

మహిళల రక్షణకు ఏదైనా చేస్తాం.. ఎప్పుడూ వారి వెంటే ఉంటాం.. అసలు మా పార్టీ నినాదమే నారీన్యాయ్.. ఇది మన దేశంలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ గర్వంగా చెప్పుకునే విషయం.. కానీ ఇదంతా ఉత్తి కాకమ్మ కబుర్లే అని.. కేవలం ఈ నినాదాన్ని పార్టీకి ఓ బెనిఫిట్ లా వాడుకోవడానికి మాత్రమే అని మరోసారి రుజువుచేసింది. కథువా రేప్ కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన వారికే అసెంబ్లీ సీట్లు ప్రకటించి తన డొల్లతనాన్ని బయటపెట్టుకుంది.

కథువా రేప్ కేస్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు.. ఎనిమిదేళ్ళ బాలిక అసిఫాబానోను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. జమ్మూకాశ్మీర్ అంతటా నిరసనలు, న్యాయ పోరాటాలు జరిగాయి. ఇటు ప్రజాసంఘాలతో పాటు, పలువురు ప్రముఖులు తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. రాజకీయ ప్రతిపక్షపార్టీలు కూడా శాశనసభ నుంచి వాకౌట్ చేసి తమ నిరసనను వ్యక్తంచేశాయి. ఇదే సమయంలో ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, గులాం నబీ ఆజాద్, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు క్యాండిల్ లైట్ మార్చ్ ను నిర్వహించారు. నారీన్యాయ్ అంటూ బాధితుల తరపున తామెప్పుడూ పోరాడతాం అని ఈ నిరసన ద్వారా కాంగ్రెస్ చాటిచెప్పింది. మరి ఇప్పుడు నారీ న్యాయ్ కు కాంగ్రెస్ చెప్తున్న నిర్వచనం మరో విధంగా ఉంది. కథువా కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన వారికి పార్టీ సీట్లు కేటాయించి మహిళలకు అండగా నిలుస్తామన్న భరోసాను తొక్కిపడేసింది. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు మూడో అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది.ఈ జాబితాలో కథువా రేప్ కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన మాజీ ఎంపీ మరియు మంత్రి లాల్ సింగ్ పేరు ఉండడంతో కాంగ్రెస్ పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కథువా కేసు నిందితులకు మద్దతుగా అప్పుడు అటవీశాఖ మంత్రిగా ఉన్న లాల్ సింగ్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. అంతేకాకుండా వారికి అనుకూలంగా ప్రకటనలు చేయడం పెద్ద చర్చకు కూడా దారితీసింది. దీంతో వెల్లు విరిసిన ఆగ్రహ నిరసనల మధ్య ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈయనకు సీటు ప్రకటించడంపై సర్వత్ర ప్రశ్రలు తలెత్తున్నాయి. క్యాండిల్ మార్చ్ నిర్వహించిన రాహుల్, ప్రియాంకలతో పాటు ఆ పార్టీకి సిగ్గులేదా అంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. నారీన్యాయ్ అని గర్వంగా ప్రకటించుకునే కాంగ్రెస్ పార్టీ.. రేపిస్టులను సమర్ధించేవారికి సీటు కేటాయించడంతోనే ఆ పార్టీకి మహిళలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్ధమవుతోందని, ఇది ఆ పార్టీకే సిగ్గుచేటు అని పలువురు ప్రముఖులతో పాటు ఇటు రాజకీయ నేతలు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ తన అసలు రంగులను బయటపెడుతోంది.. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉంటారన్న సంగతి మర్చిపోవద్ధంటున్నారు.

Read more

Local News